దాల్చిన చెక్క రుచికి మాత్రమే కాదు అందానికి కూడా.. ఎలాగో తెలుసుకోండి..!

*దాల్చిన చెక్క రుచికి మాత్రమే కాదు అందానికి కూడా.. ఎలాగో తెలుసుకోండి..!

Update: 2023-01-20 02:38 GMT

దాల్చిన చెక్క రుచికి మాత్రమే కాదు అందానికి కూడా.. ఎలాగో తెలుసుకోండి..!

Health Tips: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతాయి. మార్కెట్‌లో లభించే బ్యూటీప్రొడక్ట్స్‌ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పైగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఈ పరిస్థితిలో ముఖానికి సహజంగా పోషణను అందించాలి. వంటగదిలో ఉండే దాల్చిన చెక్క దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఇది అనేక చర్మ సమస్యలను తొలగిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. దాల్చిన చెక్క తేనె ఫేస్ ప్యాక్

దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే దాల్చినచెక్క, తేనె కలిపి ప్యాక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇది మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఒక చెంచా దాల్చిన చెక్క పొడిలో రెండు చెంచాల తేనె కలిపి చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మొటిమల సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

2. దాల్చిన చెక్క ఆలివ్ ఆయిల్

చలికాలంలో పొడిబారిన నిర్జీవమైన చర్మంతో ఇబ్బంది పడితే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయండి. తేలికపాటి చేతులతో చర్మాన్ని మసాజ్ చేయండి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి డ్రై అండ్ డ్రై స్కిన్ సమస్య దూరమవుతుంది. పగిలిన పెదాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

3. దాల్చిన చెక్క అరటిపండు

మీరు దాల్చిన చెక్క, అరటిపండుతో చేసిన ఫేస్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్క అరటిపండు ఫేస్ ప్యాక్‌తో చర్మం మృదువుగా, సహజంగా మెరుస్తుంది. అరటిపండును బాగా మెత్తగా చేసి దానికి ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 2 నిమిషాలు మసాజ్ చేయాలి. ముఖంపై 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

Tags:    

Similar News