Cholesterol: కొలస్ట్రాల్‌ పెరగొద్దంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

Cholesterol: ఈ రోజుల్లో చాలామంది కొలస్ట్రాల్‌ బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారం తీసుకోవడం.

Update: 2022-07-18 15:30 GMT

Cholesterol: కొలస్ట్రాల్‌ పెరగొద్దంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!

Cholesterol: ఈ రోజుల్లో చాలామంది కొలస్ట్రాల్‌ బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారం తీసుకోవడం. మీ శరీరంలో కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే ముందుగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే గుండెకి చాలా ప్రమాదం. పెరిగిన కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలో చాలా మందికి తెలియదు. వ్యాయామంతో పాటు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. కొవ్వు మాంసాలను మానుకోండి

మాంసం ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకి మంచి మూలమని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల మాంసాలలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వు ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది.

2. తీపి పదార్థాలు తక్కువగా తినండి

తీపి, చక్కెర పదార్థాలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చక్కెర పదార్థాలకి బదులుగా పండ్లను తినండి.

3. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు

ఆహారంలో సంతృప్త కొవ్వును తగ్గించండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు ఎక్కువగా పెరిగితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లవుతుంది.

4. ఇవి డైట్‌లో ఉండాల్సిందే..

మీ ఆహారంలో ఓట్స్, బార్లీ, యాపిల్స్, బీన్స్, అవిసె గింజలు, చియా గింజలను చేర్చుకుంటే మంచిది. తగినంత మొత్తంలో కరిగే ఫైబర్ తీసుకోండి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

5. కూరగాయలు

ఆహారంలో కూరగాయలని చేర్చుకోవాలి. బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి దుంపలు డైట్‌లో ఉండాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి.

Tags:    

Similar News