Health Tips: ఈ పానీయాలు, ఫుడ్స్ కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.. అవేంటంటే..?
Health Tips: మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
Health Tips: మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు మొత్తం అధిక కొలెస్ట్రాల్ వల్ల సంభవిస్తాయి. అందుకే మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పానీయాలని డైట్‌లో చేర్చుకోవాలి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. టొమాటో జ్యూస్
టొమాటో అనేది దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగించే ఒక కూరగాయ. ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. వాస్తవానికి టమోటలో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది లిపిడ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కాబట్టి టమోటా రసం ప్రతిరోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
2. కోకో
మీరు డార్క్ చాక్లెట్ తిన్నారంటే కోకో పేరు తప్పకుండా వినాల్సిందే. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఫ్లేవనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే కోకో డ్రింక్స్‌లో ఉండే మోనో-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా శరీరానికి ప్రయోజనం చేకూరుస్తాయి.
3. ఓట్స్
ఓట్స్ ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది బీటా గ్లూకాన్‌లను కలిగి ఉంటుంది. ఇది కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది కొలెస్ట్రాల్ శోషణ రేటును తగ్గిస్తుంది.
4. గ్రీన్ టీ
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఒక ఉత్తమమైన ఎంపిక. ఇందులో ఉండే క్యాటెచిన్స్, ఇతర యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది అధిక బీపీ, గుండెపోటు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.