Chickpeas: పిడికెడు గుండెకు గుప్పెడు శనగలు

Chickpeas: ప్రతి రోజూ ఒక గుప్పెడు శనగల్ని మన ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బులకు దూరంగా వుండవచ్చు.

Update: 2021-04-16 06:56 GMT

Chickpeas:(File Image)

Chickpeas: తెలుగు వారందరికీ సుపరిచితమైనవే శనగలు. వీటిలో రెండు రకాలు దేశవాళీ శనగలు లేదా నల్ల శనగలు, కాబూలీ శనగలు వుంటాయి. శనగల్లో వుండే సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, బీ విటమిన్, ఫైబర్, ఐరన్ వంటివి పోషకాలు ఉన్నందున గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు LDL కొలెస్ట్రాల్‌ను ఇది బాగా తగ్గిస్తుంది. శనగల గురించి మరిన్ని వివరాలను మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

శనగల్లో ఉండే పీచుపదార్థం రక్తంలోని షుగర్, కొవ్వులను నియంత్రిస్తాయి. ముఖ్యంగా శనగల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బులు కూడా రావు. ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపర్చడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు నిరభ్యంతరంగా రోజుకు ఒక కప్పు శనగలను తీసుకోవచ్చు.

మాంసాహారం తినని వెజిటేరియన్స్ కు శనగలు ఒక వరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ లో అంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ కన్న శెనగల్లో పది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. దీంతో శరీరానికి చాలా మంచి పోషణ లభిస్తుంది. అలాగే శెనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పాలల్లో ఉండే కాల్షియానికి దాదాపు సమానమైన కాల్షియం శెనగల్లో ఉంటుంది.

చిన్నారులకు నిరంతరం ఏదో ఒక రూపంలో శనగల్ని పెడుతూ ఉంటే ఎముకలు దృఢంగా మారి ఎముకల పుష్టి కూడా కలుగుతుంది. ఇవి బిపిని కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా శెనగల్ని కనుక రక్తం తక్కువగా ఉన్నవారు తీసుకుంటే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి రక్తహీనత ఉన్నవారికి కూడా బాగా మేలు చేస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.

మీ పిల్లలకి స్నాక్స్ గా వీటిని ఎక్కువగా పెడుతూ ఉండండి. వాళ్ళల్లో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీటి మూలంగా ఒత్తిడీ ఆందోళన దూరమవుతాయి. మంచి మూడ్ లోకి వస్తారు. డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది.నిద్ర అనేది బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా వీటిని తినడం మొదలు పెట్టండి. ముఖ్యంగా వీటిలో ఐరన్ ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి బాగా శక్తి అంది రోజంతా శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గవు. అందువల్ల మనం ఉత్సాహంగా ఉంటాము. సో ఇంకెందుకు ఆలస్యం మన రెగ్యులర్ ఆహారంలో శనగల్ని చేర్చుందాం.

శనగల్లో వుండే ఫాస్ఫరస్ ఎక్కువగా శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపించేస్తుంది. దీంతో కిడ్నీలపై భారం తగ్గి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీ సమస్యలతో ఉండేవాళ్లు కూడా శెనగలు తినటం ఒక మంచి ఆప్షన్. అలాగే పచ్చకామెర్లు, లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా శెనగలను తింటే ఆ వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవచ్చు. 

Tags:    

Similar News