Chia Nuts: చియాగింజలతో ఈ ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. అవేంటంటే..?
Chia Nuts: చియాగింజలతో ఈ ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. అవేంటంటే..?
Chia Nuts: నేటికాలంలో దేశంలో, ప్రపంచంలో వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అవసరం. ఇందుకోసం హెల్తీ ఫుడ్స్ డైట్‌లో ఉండాలి. చియా విత్తనాల గురించి మీరు వినే ఉంటారు. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే వీటి ప్రయోజనాలు అలాంటివి. చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. చియా గింజల వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. చియా విత్తనాలు ఫైబర్‌కి మంచి మూలం. ఈ విత్తనాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా చేస్తుంది.
2. బలహీనంగా ఉన్న వ్యక్తులు చియా గింజలు తీసుకోవడం వల్ల ధృడంగా తయారవుతారు. ఇది కాకుండా చియా గింజలు చర్మం, జుట్టు సమస్యలకు కూడా మంచిదని చెబుతారు.
3. చియా గింజలలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించాలంటే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.
4. బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలు చక్కటి ఎంపిక. వీటిని తినడం ద్వారా పొట్ట ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా ఎక్కువగా ఆహారం జోలికి వెళ్లం. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
5. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. చియా విత్తనాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
6. చియా విత్తనాలలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ నిపుణుల సలహాతో మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి సమస్యలు కలిగించే అవకాశం ఉంది.