Health Tips: సహజ పానీయాలతో అధిక కొలస్ట్రాల్‌కి చెక్..!

Health Tips: సహజ పానీయాలతో అధిక కొలస్ట్రాల్‌కి చెక్..!

Update: 2022-09-09 14:30 GMT

Health Tips: సహజ పానీయాలతో అధిక కొలస్ట్రాల్‌కి చెక్..!

Health Tips: అధిక కొలెస్ట్రాల్ శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఇది నేటి చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడుతుంది. మనం ఆహారంలో ఎక్కువ నూనె, మసాలా పదార్ధాలను ఉపయోగించడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రక్త నాళాలలో అడ్డుపడుతుంది. ఈ పరిస్థితిలో అధిక బీపీ, గుండెపోటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే కొన్ని సహజ పానీయాలు తాగడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. వాటి గురిచి వివరంగా తెలుసుకుందాం.

1. ఓట్స్ పానీయం

వోట్స్ తరచుగా అల్పాహారంలో తినాలని చెబుతారు. ఇందులో బీటా గ్లూటెన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ధమనులలో ఉండే అడ్డంకిని తొలగిస్తుంది. మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు ఓట్స్ డ్రింక్ తాగితే కొలస్ట్రాల్‌ తగ్గుముఖం పడుతుంది.

2. బెర్రీ పానీయం

బెర్రీస్‌లో బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజు బెర్రీల సహాయంతో ఒక పానీయం తయారచేసుకొని తాగాలి.

3. టొమాటో జ్యూస్

టొమాటో అనేది ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే లైకోపీన్ సమ్మేళనం పుష్కలంగా లభిస్తుంది. ఇది కాకుండా కూరగాయలలో నియాసిన్, ఫైబర్ ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

4. గ్రీన్ టీ

గ్రీన్‌ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీనికి కారణం ఇందులో అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.

Tags:    

Similar News