Dark Circles: స్వచ్ఛమైన పాలతో డార్క్‌ సర్కిల్స్‌కి చెక్..!

Dark Circles: స్వచ్ఛమైన పాలతో డార్క్‌ సర్కిల్స్‌కి చెక్..!

Update: 2022-04-13 13:30 GMT

Dark Circles: స్వచ్ఛమైన పాలతో డార్క్‌ సర్కిల్స్‌కి చెక్..!

Dark Circles: కళ్లకింద నల్లటి వలయాలు స్త్రీలకే కాదు పురుషులకు కూడా పెద్ద సమస్య. స్క్రీన్‌ని ఎక్కువగా చూడడం, తక్కువ నిద్రపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇవి ఏర్పడుతాయి. ఇవి మనల్ని అలసిపోయి ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. మీరు కూడా డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతుంటే పాలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. ఎందుకంటే డార్క్ సర్కిల్స్ చికిత్సకు పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. జన్యుశాస్త్రం, వృద్ధాప్యం, చర్మం పొడిబారడం, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేయడం, మానసిక, శారీరక ఒత్తిడి, నిద్ర లేకపోవడం పోషకాహారం లేకపోవడం వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ ఏర్పడుతాయి.

1. బాదం నూనె, పాలు

చల్లని పాలలో కొద్దిగా బాదం నూనె కలపండి. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో రెండు కాటన్ బాల్స్ ముంచండి. నల్లటి వలయాలను కప్పి ఉంచే విధంగా కళ్లపై కాటన్ బాల్స్ ఉంచండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మంచినీటితో కడగండి. మీరు ప్రతిరోజూ ఈ చిట్కాని పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

2. చల్లని పాలు

ముందుగా ఒక గిన్నెలో కాస్త చల్లని పాలను తీసుకోవాలి. అందులో రెండు కాటన్ బాల్స్ నానబెట్టాలి. తర్వాత నల్లటి వలయాలను కప్పి ఉంచే విధంగా కళ్లపై కాటన్ బాల్స్ ఉంచాలి. వాటిని 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత కాటన్ బాల్స్ తొలగించాలి. తర్వాత మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మీరు దీన్ని ప్రతిరోజూ మూడుసార్లు పునరావృతం చేయవచ్చు.

3. రోజ్ వాటర్, పాలు

చల్లని పాలు అందులో రోజ్ వాటర్ కలపాలి. మిశ్రమంలో రెండు కాటన్ ప్యాడ్లను నానబెట్టాలి. వాటిని మీ కళ్లపై ఉంచాలి. దీంతో డార్క్ సర్కిల్స్‌ని కవర్ చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. కాటన్ ప్యాడ్ తొలగించి మంచినీటితో కడగాలి. నల్లటి వలయాలను తొలగించడానికి మీరు ప్రతి వారం 3 సార్లు పాలతో ఇలా చేయవచ్చు.

Tags:    

Similar News