Health Tips: వెల్లుల్లితో మొటిమలకి చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
Health Tips: ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని కోరుకుంటారు.
Health Tips: ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి ముఖంపై ఏర్పడే మొటిమలు ఇబ్బందిపెడుతాయి. వీటివల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సమస్యని ఎదుర్కొన్నవారే. అయితే ఈ సమస్య పరిష్కారానికి ఇంట్లో ఉండే వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. దీనిని ఏ విధంగా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.
వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ముఖం, మెడపై ఉన్న మొటిమలను తొలగించవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి నుంచి మూడు లేదా నాలుగు మొగ్గలను వేరు చేయాలి. వాటిని కత్తి సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మొటిమపై ఉంచి బ్యాండేజీని వేసుకోవాలి. ఇలా దాదాపు 5 నుంచి 6 గంటల పాటు అలాగే ఉంచి చివరకు ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. తప్పకుండా ఈ పద్ధతిని అనుసరిస్తే కొన్ని రోజుల్లో మొటిమలు మాయమవుతాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయ మిశ్రమం
ఉల్లిపాయలను వెల్లుల్లితో కలిపి ముఖంపై రాసుకంటే మొటిమలు తొలగిపోతాయి. ముందుగా రెండింటినీ బాగా గ్రైండ్ చేసి తర్వాత దాని రసాన్ని పిండాలి. ఇప్పుడు కాటన్ సహాయంతో మొటిమల మీద అప్లై చేసి దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరిగా శుభ్రమైన నీటితో ముఖం కడగాలి.
వెల్లుల్లి, ఆముదం మిశ్రమం
ఆముదం సాధారణంగా జుట్టు పెరుగుదల, జుట్టు బలం కోసం ఉపయోగిస్తారు. కానీ మీరు వెల్లుల్లితో వాడితే మొండి మొటిమలు కూడా మాయమవుతాయి. దీని కోసం 2 నుంచి 3 వెల్లుల్లి మొగ్గలు తీసుకుని అందులో కొన్ని చుక్కల ఆముదం నూనె కలపాలి. రాత్రి పడుకునేటప్పుడు ప్రభావిత ప్రాంతాలలో రాసి ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.