Lips Care: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా.. ఈ చిట్కాలు పాటించండి..!
Lips Care: చలికాలం వచ్చిందంటే చాలు పెదవులు పగిలి పిల్లలు, పెద్దలు ఇబ్బంది పడుతారు.
Lips Care: చలికాలం వచ్చిందంటే చాలు పెదవులు పగిలి పిల్లలు, పెద్దలు ఇబ్బంది పడుతారు. చలి ప్రభావం ముఖం,పెదవులపై ఎక్కువగా కనిపిస్తుంది. పొడి పెదాలు ముఖం ఛాయను వాడిపోయేలా చేయడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి. పగిలిన పెదాలు అంద విహీనంగా కనిపిస్తాయి. దాని చుట్టుపక్కల చర్మం కూడా పగిలిపోతుంది. పొడి పెదాలను మృదువుగా చేయడానికి ఈ ఇంటి నివారణలను అనుసరించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
చలికాలంలో పెదాలు పగిలిపోవడానికి చాలా కారణాలున్నాయి. అతి ముఖ్యమైన కారణం శరీరంలో తేమ లేకపోవడమే. చలికాలంలో ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల పెదవులు పగులుతాయి. అదే సమయంలో పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కోవడం, నాలుకను పెదవులపై పదే పదే అప్లై చేయడం వల్ల కూడా పెదవులు పగులుతాయి. పెదవులను పొడిబారేలా చేసే రసాయనాలను కొందరు వాడుతుంటారు. అంతేకాదు పెదవులపై అలెర్జీలు లేదా చికాకు కారణంగా పొడిబారుతాయి. తక్కువ నీరు త్రాగడం, చల్లగా ఉండటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది.
ఇంటి నివారణలు
బాదం నూనె రాయండి- చలికాలంలో పెదవులు పగిలిపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ పడుకునే ముందు బాదం నూనెను పెదవులపై రాయండి. 5 నిమిషాల పాటు పెదాలను సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో పెదాలు చలికాలం అంతా గులాబీ రంగులో మృదువుగా ఉంటాయి.
కొబ్బరి నూనె రాయండి- కొబ్బరి నూనె పగిలిన పెదవులను నయం చేయడానికి ఒక మంచి ఔషధం. కొబ్బరి నూనె రాసుకునే వారికి పెదాలు పొడిబారడం అనే సమస్య ఉండదు. కొబ్బరి నూనెను రోజుకు 2-3 సార్లు పెదవులపై రాయండి. దీంతో పెదవుల నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
పెదవులపై తేనెను పూయండి- పెదవుల పగిలిన సమస్య ఎక్కువగా ఉన్నవారు పెదవులపై తేనెను వాడండి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారడంతో పాటు పగుళ్లు కూడా తగ్గుతాయి. దీంతో పెదవుల నొప్పి కూడా తగ్గుతుంది.
పెదవులు పగిలిపోకుండా జాగ్రత్తలు
చలికాలంలో చాలా చల్లని లేదా వేడి నీళ్లతో ముఖాన్ని పదే పదే కడగకండి. అధిక రంగు, ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.పెదవుల చుట్టూ చర్మాన్ని శుభ్రంగా ఉంచండి. పెదవులు, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి. రాత్రి పడుకునే ముందు లిప్ బామ్ ఉపయోగించండి.