Cashew Milk: మంచి నిద్ర కోసం జీడిపప్పు పాలు..! ఎలా తయారు చేయాలో తెలుసా..?
* జీడిపప్పుతో సహా అనేక డ్రై ఫ్రూట్స్ నిద్రకు చాలా మంచివిగా భావిస్తారు.
Cashew Milk: మనిషికి నిద్ర చాలా అవసరం. నిద్రలేకపోతే ఒక వ్యక్తి ఏ పనిచేయలేడు. దేనిపై దృష్టి సారించలేడు. మీ శరీరంతో పాటు మీ మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి నిద్ర అవసరం. అయితే చాలామంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదు.
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు. మంచి నిద్ర కోసం జీడిపప్పు పాలను తాగవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జీడిపప్పు పాలు ఎలా తయారు చేయాలి
3-4 జీడిపప్పులు తీసుకుని కప్పు పాలలో నానబెట్టాలి. వాటిని 4-5 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పును తీసుకుని దంచాలి. వాటిని పాల గిన్నెలో వేయాలి. రుచి కోసం కొంచెం చక్కెరను కలపాలి. ఇప్పుడు కాసేపు మరిగించాలి. వెంటనే మీ పానీయం సిద్ధంగా ఉంటుంది. దీన్ని వేడిగా లేదా చల్లగా తీసుకోవచ్చు.
ఈ పానీయం తయారు చేసిన తర్వాత నిద్రవేళలో ఖచ్చితంగా తాగాలి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి మరుసటి రోజు తాజాగా ఉండటానికి పనిచేస్తుంది.
జీడిపప్పుతో సహా అనేక డ్రై ఫ్రూట్స్ నిద్రకు చాలా మంచివిగా భావిస్తారు. ఇది మెలటోనిన్‌తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. పరిశోధన ప్రకారం మెలటోనిన్, మెగ్నీషియం, జింక్ కలయిక నిద్రలేమి సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు మంచి నిద్ర కోసం ఎల్లప్పుడూ జీడిపప్పులను తీసుకోవచ్చు.
అలాగే పాలు బాగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల వృద్ధులలో నిద్ర, మానసిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి నిద్రవేళలో పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.