Corona: దేశంలో ఈ 2 రకాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. తప్పకుండా ఈ సలహాలు పాటించండి..!
Corona New Variant: ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.
Corona New Variant: ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చైనా, అమెరికా, జపాన్‌లలో పరిస్థితి మరింత దిగజారింది. చైనాలో ఒమిక్రాన్ bf.7 వేరియంట్, అమెరికా, జపాన్‌లలో X-BB వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మూడు దేశాల్లోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అమెరికాలో ఒమిక్రాన్ xbb 1.5 వేరియంట్ అంటువ్యాధిగా మారింది. 40 నుంచి 45 శాతం మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
xbb 1.5 వేరియంట్ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఈ వేరియంట్ కేసులని భారతదేశంలో కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదల లేదు. వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాలైన కరోనా కేసులు వస్తున్నాయి. INSACOG ప్రకారం X-BB 1.5 సబ్-వేరియంట్‌తో సోకిన వారి సంఖ్య భారతదేశంలో ఏడుకి పెరిగింది. ఇది కాకుండా bf.7 వేరియంట్‌ల కేసులు పెరుగుతున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌లో ఈ వేరియంట్‌లో ముగ్గురు సోకినవారిని గుర్తించారు.
bf.7 వేరియంట్ కంటే xbb 1.5 వేరియంట్ ఎక్కువగా విస్తరిస్తోంది. BF.7 వేరియంట్ కేసులు చైనాలో మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే X-BB 1.5 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజుల్లోనే దాదాపు 30 దేశాలకు వ్యాపించింది. ఇది సింగపూర్‌లో ప్రారంభమైంది. ఇక్కడ 55 శాతం మంది ప్రజలలో దీనిని గుర్తించారు. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులను బాధితులుగా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒమిక్రాన్‌కి సంబంధించి ఈ రెండు రకాలు కేసులు భారతదేశంలో తక్కువగా ఉన్నాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎలాగైనా ఫ్లూ, వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు మాస్క్‌లను తప్పకుండా ఉపయోగించాలి. బూస్టర్ డోస్ తీసుకోని వారు తప్పకుండా తీసుకోవాలి.