షుగర్ పేషెంట్లు బంగాళదుంప తినవచ్చా.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
Health Tips: డయాబెటీస్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Health Tips: డయాబెటీస్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధిలో తినడం వెంటనే ప్రభావం కనిపిస్తుంది. తప్పుడు ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. బంగాళదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు చక్కెరను పెంచడానికి పని చేస్తాయి. అందువల్ల డయాబెటిక్ రోగులు బంగాళాదుంపలతో తయారు చేసిన ఆహారాలు తినాలా వద్దా అనే సందేహంలో ఉంటారు.
బంగాళాదుంపలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని పెంచుతాయి. బంగాళదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలు తినడానికి ముందు ఆలోచించాలి. పరిశోధన ప్రకారం బంగాళదుంపలు చక్కెర స్థాయిని పెంచుతాయి. కానీ మితంగా తింటే ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. అయితే వీటిని ఏదైనా కూరగాయలు లేదా పప్పులతో కలిపి తీసుకోవాలి. తద్వారా శరీరంలో స్టార్చ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది.
బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పొటాటో చిప్స్ లాంటివి తినకూడదు. ప్యాక్ చేసిన బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని తక్కువగా తినాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను పప్పులతో తినవచ్చు. బంగాళాదుంపలలో ఉండే పిండి పదార్థాలు శరీరానికి ప్రొటీన్, ఫైబర్ వంటివి అందిస్తాయి. ఇవి చక్కెర స్థాయిని పెంచుతాయి. బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.