కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి తినవచ్చా.. వైద్యుల సలహా ఏంటంటే..?

కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి తినవచ్చా.. వైద్యుల సలహా ఏంటంటే..?

Update: 2022-10-10 14:30 GMT

కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి తినవచ్చా.. వైద్యుల సలహా ఏంటంటే..?

High Cholesterol: నెయ్యిలో అనేక రకాల విటమిన్లు, కాల్షియం, పొటాషియంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి తినడం వల్ల శరీరానికి బలం చేకూరడమే కాకుండా జీర్ణవ్యవస్థ నుంచి చర్మం వరకు అన్ని సమస్యలని తొలగిస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి తినవచ్చా లేదా అనేది తెలుసుకుందాం.

నెయ్యిలో ఉండే పోషకాలు, ప్రత్యేక లక్షణాల కారణంగా ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు గుండెకు మాత్రమే కాదు జీర్ణక్రియకి కూడా చాలా మేలు చేస్తుంది. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే దీని కోసం నెయ్యిని సమతుల్య మొత్తంలో తీసుకోవడం ముఖ్యం.

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కూడా నెయ్యి తీసుకోవచ్చు. అయితే దీని కోసం వారు నెయ్యిని సమతుల్యంగా తీసుకోవాలి. రోజూ 2 నుంచి 3 చెంచాల నెయ్యి తింటే మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి మనిషి శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. వాటిని మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెడు కొలెస్ట్రాల్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL), అయితే మంచి కొలెస్ట్రాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL). చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనులు మూసుకుపోయి శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Tags:    

Similar News