Health Tips: డయాబెటిక్‌ పేషెంట్లు పన్నీర్‌ తినవచ్చా.. ఎలాంటి ఫలితాలు ఉంటాయి..?

Health Tips: మధుమేహం ఒక నయంకాని వ్యాధి. కానీ సరైన డైట్‌ పాటించి నియంత్రించవచ్చు.

Update: 2023-01-10 15:45 GMT

Health Tips: డయాబెటిక్‌ పేషెంట్లు పన్నీర్‌ తినవచ్చా.. ఎలాంటి ఫలితాలు ఉంటాయి..?

Health Tips: మధుమేహం ఒక నయంకాని వ్యాధి. కానీ సరైన డైట్‌ పాటించి నియంత్రించవచ్చు. మీ ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. కానీ ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోరు. పిండిపదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలలో పన్నీర్‌ ఒకటి. వాస్తవానికి ఇందులో అధిక ప్రోటీన్, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. పన్నీర్‌ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పన్నీర్‌ చాలా మేలు చేస్తుంది.

పన్నీర్‌ తక్కువ గ్లెసమిక్‌ ఇండెక్స్‌ ఆహారం. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారమని చెప్పవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. పనీర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. పన్నీర్‌లో ప్రోటీన్లు, వివిధ రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి.

డయాబెటిక్ పేషెంట్లు పగలు లేదా రాత్రి భోజనంలో పన్నీర్‌ తీసుకోవచ్చు. టోన్డ్ మిల్క్‌తో తయారుచేసిన పనీర్ బ్లడ్ షుగర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు రోజులో 80 నుంచి 100 గ్రాముల పన్నీర్‌ సరిపోతుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పనీర్‌లో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

పన్నీర్‌ ఎలా తినాలి..?

షుగర్ పేషెంట్లకు పన్నీర్‌ చాలా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పన్నీర్‌ని పచ్చిగా, వండిన రూపంలో తీసుకోవచ్చు. అయితే పచ్చి పన్నీర్‌లో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ రోగులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా పన్నీర్‌ని ప్రత్యేక వంటకంగా కూడా తినవచ్చు. దీనిని కూరగాయలు, స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

Tags:    

Similar News