Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!
Calcium Rich Foods: ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!
Calcium Rich Foods: ఎముకల బలం చాలా ముఖ్యం లేదంటే శరీరం పూర్తిగా బలహీనమవుతుంది. దీని కోసం కాల్షియం ఎక్కవగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. మన శరీరంలో 99% కాల్షియం ఎముకలలో, 1% దంతాలలో ఉంటుంది. ఈ ప్రత్యేక పోషకం మన కండరాలు, రక్త నాళాలు, గుండెకు చాలా ముఖ్యమైనది. మీరు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు విరిగిపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. అయితే కాల్షియం అధికంగా ఉండే ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. పాల ఉత్పత్తులు
ఎముకలు దృఢంగా ఉండాలంటే పాలు, వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం అవసరం. ప్రతిరోజు పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని తప్పనిసరిగా తినాలి. వీటి ద్వారా మీరు పెద్ద మొత్తంలో కాల్షియం పొందుతారు.
2. బాదంపప్పు
బాదం తినడం వల్ల మెదడు షార్ప్‌గా పనిచేస్తుంది. అయితే ఇందులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకలకు విపరీతమైన బలం చేకూరుతుంది.
3. సోయాబీన్స్
సాధారణంగా సోయాబీన్స్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. దీని వల్ల ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు. మీరు సోయా చంక్స్, సోయా పాలు లేదా టోఫు తినవచ్చు.
4. ఉసిరి
ఉసిరి విటమిన్ సి గొప్ప మూలంగా చెబుతారు. ఇది మన జుట్టు, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఇది కాల్షియం మంచి మూలం కూడా. ఇది శరీరాన్ని బలంగా చేస్తుంది.
5. జీలకర్ర
జీలకర్ర మన ఇళ్లలో క్రమం తప్పకుండా వినియోగించే ఒక మసాలా దినుసులలో ఒకటి. కాల్షియం పొందడానికి మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ జీలకర్రను వేసి తాగితే సరిపోతుంది.