Health Tips: ఈ చిన్న సుగంధ ద్రవ్యం మీ బరువుని తగ్గిస్తుంది.. అదేంటంటే..?

Health Tips: కరోనా వైరస్, లాక్‌డౌన్‌ పుణ్యమా అని చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు.

Update: 2022-07-18 01:30 GMT

Health Tips: ఈ చిన్న సుగంధ ద్రవ్యం మీ బరువుని తగ్గిస్తుంది.. అదేంటంటే..?

Health Tips: కరోనా వైరస్, లాక్‌డౌన్‌ పుణ్యమా అని చాలామంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. కదలకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పెంచుకోవడం అంత సులువు కాదు తగ్గించుకోవడం. అందుకే చాలామంది ఇప్పుడు ఎక్కువసేపు జిమ్‌లలో గడుపుతున్నారు. అయితే వ్యాయామంతో పాటు చిన్న చిట్కా పాటిస్తే బరువుని సులభంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

స్థూలకాయం అనేది ఒక వ్యాధి కాదు. కానీ దీని వల్ల అనేక వ్యాధులకి గురికావాల్సి ఉంటుది. బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మీరు యాలకులని ఉపయోగించవచ్చు. ఇది జలుబు, దగ్గు, నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుందని చాలా మందికి తెలియదు.

కొవ్వును కరిగించే గుణాలు యాలకులలో పుష్కలంగా ఉంటాయి. రోజూ ఆహారంలో చేర్చుకుంటే పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు సహజంగా కరిగిపోతుంది. ఈ సుగంధ గరం మసాలాను సాధారణంగా కూరలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. కొంతమంది యాలకులని పాలు, టీలో కూడా వేసుకొని తాగుతారు. యాలకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపు సమస్యలు దూరమవుతాయి, అసిడిటీ, మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్ వంటివి ఉండవు. జీర్ణశక్తి పెరగడం వల్ల కొవ్వు కరగడం సులభం అవుతుంది. క్రమంగా బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు చిన్న యాలకులని పచ్చిగా తింటే అది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News