Health Tips: ఈ గ్రీన్‌ కాఫీ బరువు తగ్గించడంలో పవర్‌ ఫుల్‌..!

Health Tips: ఎప్పుడైతే అధికంగా బరువు పెరుగుతారో అప్పుడు మీ శరీర ఆకృతి దెబ్బతింటుంది.

Update: 2022-08-26 14:30 GMT

Health Tips: ఈ గ్రీన్‌ కాఫీ బరువు తగ్గించడంలో పవర్‌ ఫుల్‌..!

Health Tips: ఎప్పుడైతే అధికంగా బరువు పెరుగుతారో అప్పుడు మీ శరీర ఆకృతి దెబ్బతింటుంది. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు.. కానీ దీని కారణంగా అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే. అప్పుడే మీరు పొట్ట, నడుముపై నిల్వ ఉన్న కొవ్వును తగ్గించుకోగలుగుతారు. బరువు తగ్గడానికి మీరు గ్రీన్ టీతో సహా అనేక హెర్బల్ టీలను తాగుతారు. అయితే తప్పనిసరిగా గ్రీన్ కాఫీని ఒకసారి ప్రయత్నించండి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బ్రోకలీ కాఫీ

మనం బ్రకోలీ కాఫీ గురించి తెలుసుకుందాం. ఇది ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరం. పెరుగుతున్న బరువును తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కూరగాయలు ఎక్కువగా తినలేని వారికి బ్రకోలీ పౌడర్ ఒక మంచి ఎంపిక. బ్రోకలీ కాఫీ తక్కువ కేలరీల పానీయం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. బ్రోకలీ అనేది బరువు తగ్గడానికి అనేక పోషకాలు ఉన్న కూరగాయలలో ఒకటి. చాలా సేపు ఆకలిగా అనిపించదు. దీంతో పాటు బ్రోకలీ కాఫీలో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇది కొవ్వును విచ్ఛిన్నం చేసి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్రోకలీ కాఫీ ఎలా తయారు చేస్తారు..

దీని కోసం బ్రకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి చాలా రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పొడి ఆకారంలో ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. మీకు కావాలంటే మార్కెట్ నుంచి బ్రోకలీ పౌడర్‌ను కొనుగోలు చేయవచ్చు. తరువాత గ్యాస్ మీద పాలు వేడి చేయండి. ఇప్పుడు వేడి పాలలో బ్రకోలీ పౌడర్ మిక్స్ చేసి తాగాలి. రుచి కోసం తేనె కలుపుకోవచ్చు.

Tags:    

Similar News