Vitamin D Deficiency: ఈ విటమిన్‌ లోపిస్తే చాలా డేంజర్.. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు మొదలవుతాయి..!

Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు కచ్చితంగా అందించాలి. వీటిలో ఏది లోపించినా ఆ ఎఫెక్ట్‌ శరీరంపై పడుతుంది.

Update: 2023-12-12 15:00 GMT

Vitamin D Deficiency: ఈ విటమిన్‌ లోపిస్తే చాలా డేంజర్.. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు మొదలవుతాయి..!

Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు కచ్చితంగా అందించాలి. వీటిలో ఏది లోపించినా ఆ ఎఫెక్ట్‌ శరీరంపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యానికి గురవుతారు. అయితే విటమిన్లు అన్నింటిలో డి విటమిన్‌ చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఈ పోషకం లోపం లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. అయితే చాలా మంది వీటిని విస్మరిస్తారు. ఈ రోజు విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఎముక నొప్పి

విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పి కలుగుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. కాల్షియం తగ్గడం వల్ల కీళ్లలో నొప్పి మొదలవుతుంది. ఇది విటమిన్‌ డి లోపంగా గుర్తించాలి.

రోగనిరోధక శక్తి తగ్గడం

శరీరంలో విటమిన్ డి లోపం రోగనిరోధక వ్యవస్థపై లోతైన ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది.

జుట్టు రాలడం

విటమిన్ డి లోపం అలోపేసియా ఏరియాటా వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా జుట్టు విపరీతంగా రాలుతోంది. మీరు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానికి కారణం విటమిన్ డి లోపం అని గుర్తించండి.

చర్మం పొడిబారుతుంది

విటమిన్ డి లోపం చర్మ వ్యాధులకు కారణమవుతుంది. విటమిన్ డి లోపం వల్ల దురద, మంట, పొడిబారడం వంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఇది విటమిన్ డి లోపం వల్ల వస్తున్నాయని గుర్తించండి. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి డైట్‌లో గుడ్లు, చేపలు, పాలు, చీజ్ వంటి సూపర్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి. 

Tags:    

Similar News