Body Pains: చలికాలంలో బాడీ పెయిన్స్‌ సహజం.. ఈ చిట్కాలు పాటించండి..!

* ఈ సీజన్‌లో శరీర నొప్పులని దూరంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల చిట్కాలని పాటించాలి.

Update: 2022-12-18 08:00 GMT

 చలికాలంలో బాడీ పెయిన్స్‌ సహజం.. ఈ చిట్కాలు పాటించండి

Body Pains: చలికాలంలో శరీరంలో కొన్ని రకాల నొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ నొప్పి కీళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుపరమైన, బలహీనత, చల్లని ఆహారం తినడం, యూరిక్ యాసిడ్ వల్ల ఇది జరుగుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల కీళ్లు, శరీరంలోని ఇతర భాగాల్లో వాపులు ఏర్పడుతాయి. ఈ సీజన్‌లో శరీర నొప్పులని దూరంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల చిట్కాలని పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బరువు పెరగవద్దు:

చలికాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరగడం వల్ల శరీరంలోని కీళ్లలో నొప్పి మొదలవుతుంది. చలికాలంలో బరువు తగ్గకుండా చూసుకోవాలి.

హాట్ షవర్:

శరీర భాగాల్లో వాపులు ఉంటే రోజూ వేడివేడి స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తప్రసరణ మెరుగ్గా మారి శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది.

నీరు తాగడం:

నీరు మన శరీరానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. చలికాలంలో శరీరంలో నొప్పులుంటే రోజూ కనీసం 9 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.

ఆహారం విషయంలో శ్రద్ధ:

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ప్రధానంగా మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. బయటి ఆహారాన్ని విస్మరించండి. ఇంట్లో తయారుచేసిన ఆహారాలని తినండి. పప్పులు, పచ్చి కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

Tags:    

Similar News