Gum Bleeding: చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం..!

* ఈ కారణంగా రక్తస్రావం మొదలవుతుంది. అంతేకాదు తీవ్రమైన నొప్పి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

Update: 2022-12-10 01:08 GMT

చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే తక్షణ ఉపశమనం..!

Gum Bleeding: దంతాలతో పాటు చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. చిగుళ్ల సమస్య వస్తే దంతాలు బలహీనమవుతాయి. ఈ కారణంగా రక్తస్రావం మొదలవుతుంది. అంతేకాదు తీవ్రమైన నొప్పి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి నివారణలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. చిగుళ్లలో రక్తస్రావం, నొప్పి సమస్యను ఏ విధంగా తొలగించాలో ఈ రోజు తెలుసుకుందాం.

నిమ్మరసం, నీరు

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి, పుక్కిలించడం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గిపోతుంది. ఈ చిట్కాని రోజుకు 2-3 సార్లు పాటించాలి.

అల్లం, ఉప్పు

గోరువెచ్చని నీటిలో అల్లం, ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల చిగుళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

లవంగ నూనె

లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దంతాలు, చిగుళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తం కారుతున్న చిగుళ్లపై లవంగం నూనె రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

తెలుపు వెనిగర్‌

వెనిగర్ వాడటం వల్ల దంతాలలో నొప్పి, రక్తస్రావం సమస్య తొలగిపోతుంది. నీళ్లలో వెనిగర్ కలిపి కడిగేస్తే దంతాలు శుభ్రపడతాయి. చిగుళ్ల అసౌకర్యం తొలగిపోతుంది.

స్ట్రాబెర్రీలు, ఉప్పు

దంత సమస్యలలో స్ట్రాబెర్రీ, ఉప్పు మిశ్రమంతో బ్రష్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా బ్రష్ చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా శుభ్రపడి దంతాల సమస్యలు దూరమవుతాయి.

Tags:    

Similar News