Health Tips: ఇంట్లో దొరికే నల్లటి మసాల జలుబు, దగ్గుకి దివ్యవౌషధం..!
Health Tips: భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ మసాలాలు లేకుండా వంటకాలు పూర్తికావు.
Health Tips: భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ మసాలాలు లేకుండా వంటకాలు పూర్తికావు. ఒక వ్యక్తి మసాలా దినుసుల గురించి పూర్తి జ్ఞానం సంపాదించడానికి చాలా సమయం పడుతుంది. వాటిని ఉపయోగించడంలో నైపుణ్యం కూడా అవసరం. చాలా మసాలా దినుసులు ఔషధ గుణాలతో నిండి ఉన్నప్పటికీ ఈ రోజు నల్ల మిరియాల గురించి తెలుసుకుందాం. దీనిని సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు.
మిరియాలలో పైపెరిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు వీటిలో కనిపిస్తాయి. మీకు దగ్గు లేదా జలుబు ఉంటే తులసి ఆకులతో కొన్ని నల్ల మిరియాలు కలిపి హెర్బల్ టీని తయారుచేసుకోవచ్చు. దీని వల్ల సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. కఫం సమస్య కూడా దూరమవుతుంది.
మీరు దగ్గు కోసం మరొక చిట్కా పాటించవచ్చు. మిరియాల పొడిని వేడి బెల్లంతో కలపండి. చిన్న చిన్న మాత్రలుగా చేసుకోండి. భోజనం తర్వాత వేసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల మిరియాల పొడిని పెరుగు చక్కెరలో కలిపి తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో మిరియాలు, నల్ల ఉప్పు కలిపి తింటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.