Black Pepper: మిరియాలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మీకు తెలుసా!
Black Pepper: కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాల్లో ఆరోగ్య రహస్యాలు ఎన్నో
Black Pepper Health Benefits: కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలది ప్రత్యేక స్థానమే. వీటిని మన దేశంలో వంటల్లోనే కాదు.. ఔషధంగా కూడా మిరియాలను విరివిగానే ఉపయోగిస్తారు. మిరియాలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్యమిత్రులు సూచిస్తున్నారు. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో తెల్ల, నల్ల మిరియాలను మాత్రమే వాడుతుంటారు. వంటలకు ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మిరియాల్లో అధికంగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్ జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నివిడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు ఈజీగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాలు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి మిరియాలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్లే ఆరోగ్యమే కాదు.. ఫిట్ గానూ ఉండవచ్చు. మొటిమలు ఎక్కువగా వేధిస్తుంటే.. మిరియాలు యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయి. మిరియాలను పొడి చేసి స్ర్కబర్ తో కలిపి ముఖంపై రుద్దడం వల్ల మొటిమలతో పాటు, డెడ్ స్కిన్ తొలగిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్ తేల్చాయి.
ఆకలిగా తక్కువగా వుండే వారు ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే.. ఆకలి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఒక కప్పు నీటిలో మిరియాల పొడి, ఉప్పు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ ని చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చిగుళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాదు.. పలు దంత సమస్యల నుంచి బయటపడవచ్చు. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు. మిరియాలతో చేసిన టీ తాగితే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలో కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మిరియాల టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక వ్యవస్థకు చేరుస్తుంది.
చుండ్రు సమస్యతో బాధపడేవారు షాపూలకు బదులు మిరియాల ట్రీట్మెంట్ ట్రై తీసుకోవచ్చు. పెరుగులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. కేవలంతో నీటితో క్లీన్ చేసుకోవాలి. షాంపూ వాడకూడదు. పెప్పర్ లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రు వదిలించడంలో ఉపయోగపడతాయి.