Anti-Inflammatory Foods: శరీరంలో వేడిని తగ్గించే టమాటాలు

Anti-Inflammatory Foods: సాధారణంగా మనకు 98.6 డిగ్రీల ఫారన్ హీట్ (37 డిగ్రీల సెల్సియస్) అవసరం

Update: 2021-05-12 09:52 GMT

టమాటో (ఫైల్ ఇమేజ్)

Anti-Inflammatory Foods: సాధారణంగా మనకు 98.6 డిగ్రీల ఫారన్ హీట్ (37 డిగ్రీల సెల్సియస్) అవసరం. అంత కంటే వేడి పెరిగితే... మనకు జ్వరం, నీరసం, తలనొప్పి, జలుబు, దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం, అజీర్తి ఇలా సకల రోగాలూ వచ్చేస్తాయి. ఈ కరోనా రోజుల్లో శరీరంలో వేడి పెరిగితే చాలు... అది కరోనాయే నేమో అనే టెన్షన్ చాలా మందికి వచ్చేస్తోంది. కరోనా కాకపోయినా చాలా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల మనం ఇప్పుడు శరీరంలో వేడిని తగ్గించే ఆహార పదార్థాలేంటో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

ఆకర్షించే రంగులో ఇట్టే మనల్ని పడేసే టమాటాలు నిండా పోషకాలతో ఉన్న ఆహారం. ఇవి అద్భుతంగా వేడిని తగ్గిస్తాయి. వీటిలోని లైకోపీన్... వేటిని చూడగానే..వీర లెవెల్లో యుద్ధం చేసి తగ్గించేస్తుంది.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పాస్తాలు, బిస్కెట్లు, ఫ్రైలు, ఫ్రై చికెన్, బంగాళాదుంప చిప్స్, చక్కెర కలిపిన టీలు, సోడాలు, కూల్ డ్రింకులు ఇవేవీ తినవద్దు. తింటే వేడి విపరీతంగా పెరుగుతుంది.

సాధారణంగా పసుపు ఎక్కువ అయితే వేడి చేస్తుంది అంటారు మన పెద్దలు. కానీ వేడి చేసినప్పుడు ఇంకా ఎక్కువగా వాడేయాలి. ఇందులో కర్క్యుమిన్ అనే పోషకం ఉంటుంది. అది బాడీలో వేడిని అలా తగ్గిస్తుంది.

డార్క్ చాకొలెట్‌లో వుండే కోకో బాడీలో వేడిని తగ్గిస్తుంది. ఐతే..చాలా మంది ఫ్రిజ్‌లో కూల్ చేసిన డార్క్ చాకొలెట్ తింటారు. అలా చెయ్యకూడదు. ఫ్రిజ్ లోంచీ దాన్ని బయటకు తీసి..కూలింగ్ తగ్గాక తినాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది. మరీ ఎక్కువ తినకూడదు.

గ్రీన్ ద్రాక్ష పండ్ల లో వుండే యాంతోసియానిన్స్ బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రిజ్‌లో బాగా కూల్ చేసి మాత్రం తినకండి. కూలింగ్‌‌తో ఉన్నవి ఏవి తిన్నా..వేడి ఇంకా పెరగడం ఖాయం. కూలింగ్ పోయాక..అప్పుడు తినాలి. పండినవి కాకుండా పచ్చిగా గ్రీన్ కలర్‌లో ఉన్నవి తినాలి.

గ్రీన్ టీని ప్రపంచవ్యాప్తంగా తాగుతున్నారు. ఇందులో వేడిని బాగా తగ్గించే గుణాలున్నాయి. ముఖ్యంగా ఎపిగాల్లోకాటెచిన్-3 గల్లాటే ఉంది. ఈ పేరు మనకు చిత్రంగా ఉన్నా ఇది మనకు వేడిని తగ్గిస్తుందని శాస్త్రవ్తేతలు చెప్పారు. కాబట్టి..జ్వరమో, వేడో పెరిగిపోతే..గ్రీన్ టీ తాగితే సరి.

పియర్స్ పండ్లు..సంవత్సరమంతా లభించవు గానీ..ఇవి వేడిని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. జ్వరం లేదా వేడి ఉన్న వారు రోజూ 3 పండ్లు తింటే చాలు..వేడి తగ్గి తీరుతుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామం చేస్తూ, గాలీ, వెలుతురు ఎక్కువగా వుండే ప్రదేశాల్లో ఎక్కువగా వుంటే శరీర టెంపరేచర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News