Hibiscus Leaves for Hair: సిల్కీ అండ్ బౌన్సీ హెయిర్ కోసం మందారం
Hibiscus Leaves for Hair: మందార పువ్వులో సహజంగా లభించే అమైనో - ఆమ్లాలు మరియు జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి.
Hibiscus Leaves for Hair: ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరాల్లో మందారం ఒకటి. మందారం చెట్లు లోని ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. మందార పువ్వులో సహజంగా లభించే అమైనో - ఆమ్లాలు మరియు జుట్టు మూలాలకు అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తల వెంట్రుకలలో కీలకమైన పదార్ధం కెరాటిన్. ఇది పేరుకుపోయి జుట్టు సగానికి విరిగిపోతుంది. మందారంలో విటమిన్ సి, ప్రొటీన్ ఎక్కువగా ఉండడవం వల్ల తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కెరాటిన్(సెబమ్) ను నివారిస్తుంది.
మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది, తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది హెయిర్ ఫాలిసెల్స్ ను రీజనరేట్ చేస్తుంది. ఇంకా మందారంలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టును ఒత్తుగా, స్మూత్ గా మరియు బౌన్సీగా పెరిగేలా చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు మందారంను ఎలా ఉయోగించాలో హెచ్ ఎం టివి లైఫ్ స్టైల్ లో తెలుసుకుందాం...
Uses of Hibiscus Leaves for Hair:
- 8 మందార పువ్వులు 8 మందార ఆకులను కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. మరొక కంటైనర్లో, 1 కప్పు కొబ్బరి నూనె వేడి చేసి, మందార పేస్ట్ తో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేసి, ఆపై కొద్దిసేపు చల్లబరుచుకోవాలి. ఆ తరువాత వడ కట్టగా వచ్చిన నూనెను గాజు పాత్రలో మాత్రమే నిల్వ ఉంచాలి.
- మందారం నూనెను తలకు పట్టించి సుమారు 10 నిమిషాలు మసాజ్ చేసి సుమారు 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
- వారానికి ఒకసారి ఈ నూనెను రాత్రంతా తలకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోండి. అనంతరం వేడి నీటిలో ముంచిన టవల్ ను తలపై చుట్టుకోవాలి. అలా చేయడం వల్ల మందార నూనె మీ జుట్టు మూలాలకు బాగా గ్రహిస్తుంది. ఇలా చేయడం హెల్దీ హెయిర్ మన సొంతం అవుతుంది.
- మందారం నూనెను కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ గా ప్రతి రోజూ అప్లై చేస్తుంటే మంచి ఫలితం వుంటుంది.
- ఎండిన మందారాలను కొబ్బరి నూనెలో వేసి మరగకాచి తరచూ తలకు పెట్టుకొంటుంటే జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు ఏపుగా పెరగుతాయి. నల్లని జట్టు మీ సొంతం అవుతుంది. అలాగే తలలో దురదను నివారిస్తుంది.
- ఈ ఆయిల్ వాడటం వల్ల తలలో వుండే డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది, తలలో ఆయిల్ ప్రొడక్షన్ ను నివారించడం వల్ల చుండ్రు నివారించబడుతుంది.
- మందార పూలను మొత్తగా రుబ్బి తల కుదుళ్లకు, జట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే జట్టు రాలడం, చండ్రు తగ్గుతుంది.
- అంతే కాదు జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మాడుకు చల్లదనాన్ని ఇచ్చి, కుదుళ్లను గట్టిపరుస్తుంది. అనంతరం హెయిర్ మాస్క్లు వేసుకుంటూ వుంటే మంచి పలితం లభిస్తుంది.
- సో ఇంకెందుకు ఇన్ని ప్రయోజనాలు వుండే మందారాన్ని వాడుకుని ఆరోగ్యకరమైన జట్టును మనం సొంతం చేసుకుందాం.