Jamun Seeds Health Benefits: రోగనిరోధక శక్తి పెంచే నేరేడు గింజలు..
Jamun Seeds Health Benefits: నేరేడు గింజలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Jamun Seeds Health Benefits: కాలానికి అనుగుణంగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనలో చాలా మంది నేరేడు పండు గుజ్జును తినేసి లోపల ఉండే గింజను పడేస్తుంటాం. అయితే వీటి వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మీకు తెలుసా.? నేరేడు గింజలతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకపై మీరు పొరపాటున కూడా చెత్తలో పాడేయ్యరు. ఇంతకీ నేరేడు గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వాటిని ఎలా తీసుకుంటే మేలు జరుగుతుందో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం..
నేరేడు గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకుని తింటే.. ఆ ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు చూడవచ్చు. ఈ చిట్కాను తరచుగా ఫాలో అవడం వల్ల.. మంచి పలితాలు పొందవచ్చు.
నేరేడు గింజలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.
మజ్జిగ, నేరేడు గింజలు కూడా మధుమేహంతో పోరాడటానికి చక్కగా సహకరిస్తాయి. నేరేడు సాధారణంగా వగరుగా, పుల్లగా ఉంటుంది. ఇక గింజలు తినాలి అంటే.. కాస్త ఇబ్బందికరమే. కాబట్టి వాటిని డైరెక్ట్ గా తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి నేరేడు గింజల్ని పేస్ట్ లా తయారు చేసి మజ్జిగలో కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.
నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే అతిమూత్రం కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా మూడు సార్లు తీసుకోవడం ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు నేరేడు 5నుంచి 10 గ్రాముల గింజల చూర్ణాన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా నేరేడు పండు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది.