Benefits of Sour Butter Milk: పుల్లని మజ్జిగతో ఫుల్ ఇమ్యూనిటీ
Health Benefits of Butter Milk: పుల్లని మజ్జిగలో వుండే ప్రోబయోటిక్స్ ద్వారా కరోనా లాంటి మహమ్మారులకు చెక్ పెట్టవచ్చు.
Benefits of Sour Buttermilk: ఇమ్యూనిటీ అదే రోగనిరోధకశక్తి పెరగడానికి మందుల కోసం రోడ్లమ్మట పరుగులు పెట్టనక్కర్లేదు.. రంగురంగుల ప్యాకెట్లలో అమ్మేవాటి కోసం వేలకు వేలకు ఖర్చుపెట్టనక్కర్లేదు. మన ఇంట్లోనే వంటింట్లోనే ఉన్నదాన్ని వదిలేసి.. ఏదో చంటిపిల్లాడిని ఒళ్లో పెట్టుకుని ఊరంతా వెతికినట్లు తంతు చేస్తున్నాం. అవును మన దగ్గరే మంచి ఔషధం ఉంది. అదే పుల్లటి మజ్జిగ. అవును పెరుగును మజ్జిగ చేసుకుని.. కాస్త పులిసిన తర్వాత తాగేదే పుల్లటి మజ్జిగ.
దక్షిణ భారతదేశంలో మజ్జిగ వాడకం ఎక్కువ. అంతే కాకుండా పుల్లని మజ్జిగలో ప్రోబయోటిక్స్ ద్వారా రోగ నిరోధక శక్తని బలోపేతం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం వల్ల కరోనా లాంటి మహమ్మారికి చెక్ పెట్టవచ్చు. ఇంకా అనే రకాల ఆరోగ్యానికి మజ్జిగ పని చేస్తుంది. అదేంటో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.
శరీరం శక్తిని కోల్పోయినప్పుడు, పొడిబారుతున్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తేమను అందించి శక్తి పుంజుకొనేలా చేస్తుంది. సూర్యతాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది. మన దేశ వాతావరణంలో మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక పానీయం. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది.
మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది.ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను తీసుకోవాలి. మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది.మజ్జగలో వుండే క్యాల్షియం ఎముకలకు కావల్సిన బలాన్ని ఇచ్చి ఎముకుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మీ శరీరంలో లాక్టోజ్ సరైనపాళ్ళలో లేనప్పుడు మజ్జిగ తాగితే మీ కావల్సిన లాక్టోజ్ ను అందిస్తుంది. ఇది కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటి, వాతం, గుండెలో మంటగా ఉండటం వంటి వాటిని తగ్గిస్తుంది.
మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది.
మజ్జిగలో అధిక శాతంలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్, నియాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలుతో తయారు చేసె పెరుగు లేదా మజ్జిగా డైటేరియన్స్ కు చాలా ఆరోగ్యకరం.