Health Benefits of Cucumber: సింగిల్ పీస్ కీరదోసకాయతో ఫుల్ ఆరోగ్యం

Health Benefits of Cucumber: కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా పలు జబ్బులు సులభంగా నయమవుతాయి.

Update: 2021-06-09 10:08 GMT
దోసకాయ హెల్త్ బెనిఫిట్స్ (ఫైల్ ఇమేజ్)

Health Benefits of Cucumber: ఒకే ఒక్క కాయ.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆ కాయ ప్రకృతే మనకు అందిస్తుంది. కాస్ట్ లీ అసలే కాదు. పేదవాడికి కూడా అందుబాటులో ఉండే ఈ కాయ.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. అదే కీర దోసకాయ. వేసవి కాలంలో సరదాగా చల్లదనం కోసం తినే కీర దోసకాయ మనకు చాలా మంచిది. కీర వల్ల ఉపయోగాలు ఏంటో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.

కీర దోసకాయ దాని పరిచయం అవసరం లేని పేరు. కీరలో 90-95 శాతం నీటిని కలిగి వుండటమే కాకుండా తక్కువ కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్స్ మరియు సోడియంలను కలిగి టుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్ 'బి'తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది విటమిన్ –ఎ, విటమిన్ బి6, విటమిన్ సిను కలిగి వుంటుంది. శరీరంలో కణజాలాలను బలోపేతానికి అవసరమైన సిలికా ను అందిస్తుంది. సిలికా వల్ల కీళ్ళ జబ్బులకు దూరంగా ఉండవచ్చు. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తూ వుంటారు.

కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్ ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ మంగా జరిగేలా సహకరిస్తాయి. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఉన్నాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి. కీరదోసలో కాన్సర్ ను నిరోధించే గుణాలు సైతం ఉన్నాయి.

Tags:    

Similar News