Health Tips: ఈ విత్తనాలు బరువు తగ్గించడంలో సూపర్..!

Health Tips: బరువు పెంచుకోవడం సులువు కానీ తగ్గించుకోవడం చాలా కష్టం.

Update: 2022-09-01 08:54 GMT

Health Tips: ఈ విత్తనాలు బరువు తగ్గించడంలో సూపర్..!

Health Tips: బరువు పెంచుకోవడం సులువు కానీ తగ్గించుకోవడం చాలా కష్టం. దీని కోసం భారీ వ్యాయామాలు, మంచి డైట్‌ మెయింటెన్‌ చేయాలి. అయినప్పటికీ కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రావు. ఎప్పుడైతే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరుగుతుందో అప్పుడు మీ దుస్తులు బిగుతుగా మారతాయి. ఆపై మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరకమైన విత్తనాలు ప్రతిరోజు తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

అవిసె గింజల ప్రయోజనాలు

అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులలో మేలు చేస్తాయి. మీరు ఈ విత్తనాలను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు తప్పకుండా ఉంటాయి. 100 గ్రాముల అవిసె గింజల్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మ్యుసిలేజ్ అనే పీచు కూడా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ కాలం ఆకలి ఉండదు. దీని వల్ల బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ప్రతిరోజూ అవిసె విత్తనాలను తీసుకుంటే అది ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

అవిసె గింజలు 2 రకాలుగా ఉంటాయి. రెండిటిలో పోషకాలకి కొరత లేదు. మీరు వీటిని తినాలనుకుంటే గింజలను వేడి పాన్‌లో వేయించి ఆపై వాటిని మెత్తగా చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసులో ఈ గింజల పొడిని కలిపి ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మీరు దీని రుచిని పెంచుకోవాలనుకుంటే బెల్లం, నిమ్మరసం కలుపుకోవచ్చు. ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News