Hot Water: వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు..!

Hot Water: Hot Water: వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు..!

Update: 2022-09-08 04:15 GMT

Hot Water: వేడి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు..!

Hot Water: చాలామంది బరువు తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తారు. కొందరు ఆహారాన్ని తినడం మానేస్తారు. మరికొందరు సరైన డైట్‌ మెయింటెన్ చేస్తారు. ఈ రోజుల్లో వ్యాయామం చేయడం, జిమ్ చేయడం అనేది బెల్లీఫ్యాట్‌ని తగ్గించడానికే. అయితే బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి గోరువెచ్చని నీరు తాగడం. తరచుగా మహిళలు బరువు తగ్గడానికి వేడి నీటిని తాగుతారు. అయితే ఇది ఎంతవరకు ప్రయోజనకరమో తెలుసుకుందాం.

వేడి నీటి ప్రయోజనాలు

నీరు తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. వేడి నీరు శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. దీని కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. వేడినీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగై ఆకలిని తగ్గిస్తుంది. ఆహారం తిన్న తర్వాత వేడి నీటిని తాగితే అది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణ సమస్యలు వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

ఎప్పుడు త్రాగాలి?

ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత వేడి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగితే కొవ్వు కరిగిపోతుంది. భోజనం చేసిన తర్వాత వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కొవ్వు అదుపులో ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది. వేడి నీరు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అయితే దీని వల్ల శరీరానికి కొంత నష్టం కూడా జరుగుతుంది.

1. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల సిరల్లో వాపు వస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు మెదడు నరాలు ప్రభావితమై తలనొప్పి సమస్య మొదలవుతుంది.

2. వేడి నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అయితే అధిక మొత్తంలో వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

3. వేడి నీరు తాగడం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది.

Tags:    

Similar News