Health Tips: పాలు ఈ గింజల మిశ్రమం అద్భుత ఔషధం..!
Health Tips: అయితే పాలతో చిరోంజి గింజలు కలిపి తీసుకుంటే పోషక విలువలు మరింత రెట్టింపు అవుతాయి
Health Tips: పాలలో అన్ని రకాల పోషకాలు ఉండటం వల్ల వీటిని సంపూర్ణ ఆహారమని పిలుస్తారు. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పాలతో చిరోంజి గింజలు కలిపి తీసుకుంటే పోషక విలువలు మరింత రెట్టింపు అవుతాయి. చిరోంజీని సాధారణంగా పాయసం లేదా తీపి వంటకాలలో ఉపయోగిస్తారు. చిరోంజీని గ్రైండ్ చేసి ఆ తర్వాత పాలలో కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
చిరోంజి గింజలు చిన్నవిగా ఉండవచ్చు. కానీ ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడుతాయి. ఈ గింజల పొడిని, పాలను కలపడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీని కారణంగా శరీరం క్లీన్ అవుతుంది. మీకు అతిసారం సమస్య ఉన్నట్లయితే చిరోంజి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు, చిరోంజి పొడి కలిపి తాగితే సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.
చిరోంజి గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా వైరస్ మహమ్మారి తరువాత రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంపై చాలామంది దృష్టి సారిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు రక్తంలో చక్కెర పెరుగుదల గురించి ఆందోళన చెందుతారు. చిరోంజిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున ఇది డయాబెటిక్ రోగులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
చిరోంజీని వాపు సమస్యలో కూడా ఉపయోగించవచ్చు. అలాగే చిరోంజి గింజలను ఉపయోగించడం వల్ల మంట సమస్య తగ్గుతుందని నమ్ముతారు. కారణం దీని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అదే సమయంలో కీళ్ల నొప్పులని కూడా తగ్గిస్తాయి. మలబద్ధకం సమస్యలో చిరోంజి బాగా ఉపయోగపడుతుంది. చిరోంజీకి సంబంధించిన పరిశోధన ద్వారా ఇది స్పష్టంగా తేలింది.