Amla water: పరగడుపున ఉసిరినీరు తాగితే ఈ సమస్యలు పరిష్కారం..!
Amla water: పరగడుపున ఉసిరినీరు తాగితే ఈ సమస్యలు పరిష్కారం..!
Amla water: మనలో చాలా మందికి ఉసిరి ప్రయోజనాల గురించి తెలుసు. విటమిన్ సి, ఇతర పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఉసిరిని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. సాధారణంగా దీనిని జ్యూస్, చట్నీ, ఊరగాయ రూపంలో తింటారు. అయితే శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరొక మార్గం ఉంది. మీరు ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఉసిరి నీటిని తాగితే అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఉసిరిలో పోషకాలకు లోటు ఉండదు. ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే చక్కెర ఇందులో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
ఉసిరికాయ నీరు
ఉసిరికాయ నీటిని సిద్ధం చేయడానికి ముందుగా ఒక చెంచా ఉసిరి పొడిని తీసుకొని ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక చెంచాతో బాగా కదిలించాలని గుర్తుంచుకోండి. చివరికి ఫిల్టర్ చేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
బరువు తగ్గుతుంది
ఉసిరి బరువు తగ్గిస్తుంది. శరీర జీవక్రియ రేటు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల పొట్ట, నడుము చుట్టూ కొవ్వు తగ్గుతుంది. ఉసిరి నీటిని బరువు తగ్గించే పానీయంగా పరిగణించడానికి ఇదే కారణం.
డయాబెటిస్
మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయాన్నే ఉసిరికాయ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
చర్మానికి మంచిది
ఉసిరిని అనేక రకాల సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మీకు మొటిమలు లేదా ముడుతలతో సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఉసిరి నీటిని తాగండి. అలాగే బలమైన, మెరిసే జుట్టు కోసం ఉసిరిని ఉపయోగించవచ్చు.