Flaxseeds Health Benefits: అవిశగింజలతో కరోనాకు చెక్
Flax Seeds Health Benefits: ప్రతి రోజూ ఉదయం, సాయంత్ర ఏదో ఒక రూపంలో ఒక స్ఫూన్ అవిశగింజలను తీసుకుంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
Flax Seeds Health Benefits: యావత్ ప్రపంచాన్ని గడడలాడించింది కరోనా మహమ్మారి. మొదటి దశ వణికిస్తే, రెండో దశ మాత్రం తన ప్రతాపాన్ని చూపింది. మరో వైపు మూడో దశ పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక మంది వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. అస్సలు కరోనాను ఎదుర్కోవాలంటే ఇంత వరకు సరైన మందు మాత్రం కనిపెట్టలేదు. కాని మనసు వుంటే మార్గం వుంటుంది అంటారు మన పెద్దలు. మన వంట ఇల్లుతోనే కరోనాకు చెక్ పెట్టవద్దచ్చని కొన్ని సర్వేలు నిరూపిస్తున్నాయి. అవేంటే మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.
కరోనాకు చెక్ పెట్టాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీని మనం పెంచుకోవడం ఒక్కటే మార్గంగా కనపడుతోంది. ఇటీవల కాలంలో తీసుకునే ఆహార పదార్థాలు రుచికి తప్ప వాటిలోఆరోగ్య ప్రయోజనాలు ఉండడం లేదు. ఖర్చు ఎక్కువ తప్ప ఉపయోగం మాత్రం కనపడటం లేదు.
తక్కువ ధరల్లో దొరికే అవిశగింజలు, మెంతులు, ఆక్రూట్, నువ్వులు, వెల్లుల్లి వంటి వాటితో పెద్దలు, పిల్లలకు వచ్చే కరోనా కు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ రోజు అవిశ గింజల గురించి తెలుసుకుందాం.
• అవిశగింజల్లో వుండే 'ఒమెగా 3' ఫ్యాటీ యాసిడ్లు గుండె సమస్యలను రాకుండా చూస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. బి,పి, షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణం వుంది.