చర్మ సౌందర్యానికి బేకింగ్ సోడా ఇంతలా ఉపయోగపడుతుందా..!

Update: 2019-07-01 14:16 GMT

బేకింగ్ సోడాను అందరూ వంటగదిలో ఉపయోగించడం సహజమే, కాని చాల మందికి తెలియని విషయం ఏమిటంటే బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాని 'సోడియం కార్బోనేట్ ' అని పిలుస్తారు, దీని రసాయన లక్షణాలు మన చర్మాన్ని వ్యాధులభారీనుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. బేకింగ్ సోడా, మలినాలతో పూడిపొయిన చర్మ రంద్రాలని శుబ్రం చేసి.. సహజత్వం లేని చర్మాన్ని ఎంతో కాతివంతంగా, మరియు మృదువుగా చేస్తుంది అంటున్నారు.

చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడా ప్రయోజనాలు..

* బేకింగ్ సోడాని,నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే కాంతి వంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

* 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే.. చర్మం ఎంతో కాతివంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు.

* బేకింగ్ సోడాని స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు.. ఆ తొట్టెలో స్నానం చేస్తే శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి.. కొత్త కణాలు వస్తాయి. అవి శరీరంలో దుర్వాసనను నశింపజేసి.. శరీరాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది.

* ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడాని కొంచెం నీటితో కలిపి చర్మానికి రాస్తే శరీరం చల్లబడుతుంది.

* నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు.. నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News