Health Tips: ఉదయాన్నే ఈ పనులు చేస్తే బెల్లీఫ్యాట్‌ సులువుగా కరుగుతుంది..!

Health Tips: మీరు బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే తగ్గించుకోవడానికి జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు...

Update: 2022-03-27 07:27 GMT

Health Tips: ఉదయాన్నే ఈ పనులు చేస్తే బెల్లీఫ్యాట్‌ సులువుగా కరుగుతుంది..!

Health Tips: మీరు బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే తగ్గించుకోవడానికి జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటిదగ్గరే దీనిని తగ్గించవచ్చు. దీని కోసం మీరు ఖరీదైన ప్రాజెక్ట్‌లను కొనవలసిన అవసరం లేదు. కష్టమైన వ్యాయామాలు, యోగా చేయవలసిన అవసరం లేదు. మీ దినచర్యలో స్వల్ప మార్పులు చేస్తే చాలు. కొన్ని రోజుల్లో మీ బరువు మీ అదుపులో ఉంటుంది. ఊబకాయం క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలలో తేలింది. అందుకే ఉదయాన్నే చేసే ఈ సింపుల్ టాస్క్‌లు మిమ్మల్ని బరువు పెరిగే భారం నుంచి కాపాడుతాయి. రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. కష్టపడకుండానే బరువు తగ్గడం ఎలాగో తెలుసుకుందాం.

1. ఉదయాన్నే నీరు తాగాలి

ఉదయాన్నే రెండు గ్లాసుల నీళ్లు తాగండి.. వీలైతే ఒక గ్లాసు వేడినీళ్లు తాగండి. ఇది మీ కేలరీలు, కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇది కాకుండా మీ శరీరం హైడ్రేట్ అవుతుంది. త్వరలోనే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గిపోయి సరైన ఆకృతికి వస్తుంది.

2. అధిక ప్రోటీన్ అల్పాహారం

అల్పాహారంగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. గుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తినండి. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం.

3. సూర్యకాంతి అవసరం

శరీరంలో విటమిన్ డి స్థాయి బరువుపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పెరుగుతున్న బరువును తగ్గించడంలో విటమిన్ డి సహాయపడుతుందని తెలుసుకోండి. అందువల్ల ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. కొద్దిసేపు ఎండల ఉండండి.

4. బరువు చెక్ చేసుకోండి

బరువు తగ్గడానికి మీరు తరుచుగా చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా మీరు బరువు తగ్గడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపిస్తారు.

5. ధ్యానం

బరువు తగ్గడానికి చాలా కష్టమైన వ్యాయామాలు, యోగా చేయడం కంటే ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో క్రమంగా మీ బరువులో తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీ చర్మం, మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

Tags:    

Similar News