అందంగా కనిపించాలని కోరుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
అందంగా కనిపించాలని కోరుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Beauti Tips: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు.. ముఖ్యంగా అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి రకరకాల చిట్కాలు పాటిస్తారు. కానీ తెలిసి, తెలియక చేసే కొన్ని అలవాట్లు మీ అందాన్ని పెంచే బదులు తగ్గిస్తాయి. ఇవి చిన్నవే అయినా అందంపై ప్రభావం ఎక్కువగా చూపుతాయి. కాబట్టి అలాంటి అలవాట్లు, పనులకి దూరంగా ఉంటే మంచిది. అవేంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాత్రి పడుకునేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకొని నిద్రపోవాలని బ్యూటీషియన్లు చెబుతారు. కానీ అలసట వల్ల రాత్రిపూట ముఖం కడుక్కోని వారు చాలామంది ఉంటారు. దీంతో వారు తెలియకుండానే వారి చర్మానికి హాని చేసుకుంటున్నారు. దీని వల్ల అతని ముఖంలో ఎటువంటి జీవం ఉండదు. చాలా మంది ప్రజలు తక్కువ నీరు తాగుతారు. దీని కారణంగా చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల దురద, చర్మం బిగుతుగా మారడం జరుగుతుంది. ఇవన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు. ఈ పరిస్థితిలో మీరు తగినంత నీరు తాగాలి. అప్పుడే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
బిజీగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయరు. దీని కారణంగా వారికి చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. సన్‌స్క్రీన్‌లో జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ మొదలైన కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఇవి సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి పనిచేస్తాయి. అంతేకాదు ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం చేసేవారు నిత్య యవ్వనంగా కనిపిస్తారు.