Eye Protection: కళ్ల రక్షణ కోసం కచ్చితంగా ఈ నియమాలు పాటించాలి.. అవేంటంటే..?
Eye Protection: కళ్లు మానవులకు ప్రధాన అవయవాలు. ఇవి లేకుంటే జీవితం అంధకారం అవుతుంది...
Eye Protection: కళ్లు మానవులకు ప్రధాన అవయవాలు. ఇవి లేకుంటే జీవితం అంధకారం అవుతుంది. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. లోకంలో కళ్లు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వారిని చూశాకనైనా కళ్ల రక్షణ గురించి సమయం కేటాయించడం అవసరం. మెరుగైన కంటి చూపు కోసం మంచి డైట్ మెయింటెన్ చేయాలి. ఈ రోజు కళ్ల రక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
మీరు మీ కళ్లను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తేనెను ప్రతిరోజూ తినాలి. తేనె సహజమైన తీపి పదార్థం. ఇది కళ్లని కాపాడుతుంది. మెరుగైన చూపుని ప్రసాదిస్తుంది. కొబ్బరి లేదా నువ్వుల నూనెను ప్రతిరోజూ తేలికపాటి చేతులతో అరికాళ్ళపై రుద్దాలి. ఇలా చేస్తే మీ కళ్ళకు ప్రయోజనం చేకూరుతుంది. కంటి చూపు కూడా మెరుగవుతుంది.
ఆహారంలో ఎక్కువ ప్రొటీన్లు ఉండే డైట్‌లో చేర్చండి. కాయధాన్యాలు, గుడ్లు తినండి. మూంగ్ పప్పు తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది. దీంతో పాటు ఆకుకూరలు, సలాడ్ తినండి ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది. ఉసిరి కళ్లకు చాలా మేలు చేస్తుంది. ఉసిరికాయ తింటే కళ్లు మంచిగా కనబడుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగండి. దీంతో పాటు జామకాయ కూడా తీసుకోవచ్చు.
క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.పరగడుపున క్యారెట్ జ్యూస్ తాగాలి. దీని వల్ల అనేక రకాల కంటి వ్యాధులు తొలగిపోతాయి. ఇది కాకుండా బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ని కూడా డైట్‌లో చేర్చుకోవాలి. బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఎక్కువ సేపు కంప్యూటర్లు, సెలఫోన్‌లతో గడపకూడదు. అప్పుడప్పుడు కళ్లకి కొంచెం విశ్రాంతినివ్వాలి.