Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బంది.. ఇలా వదిలించుకోండి..!
Bad Breath: నోటి దుర్వాసన చాలా ఇబ్బంది.. ఇలా వదిలించుకోండి..!
Bad Breath: నోటి దుర్వాసన అనేది స్వయంగా వారికి తెలియదు. కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు దీంతో చాలా ఇబ్బంది పడుతారు. దీని గురించి తోటి ఉద్యోగులు, స్నేహితులు చెప్పినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా చాలామందికి ఇలా జరిగే ఉంటుంది. నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల లోపల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దంతాలు, చిగుళ్ళ సమస్య ఉంటే చెడు వాసన వస్తుంది. కొందరిలో పైయోరియా వల్ల కూడా దుర్వాసన వస్తుంది. అయితే నోటి దుర్వాసన వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. పటిక
పటిక నోటి దుర్వాసనని పోగొడుతుంది. ఒక గ్లాసు నీటిలో పటికను వేసి ఇరవై నిమిషాలు వదిలివేయాలి. తర్వాత కాటన్ సాయంతో నీటిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఈ నీటితో పుక్కిలించాలి. ఇది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది.
2. బేకింగ్ సోడా
బేకింగ్ సోడా సాధారణంగా ఆహారాన్ని బేకింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ దీంతో నోటి దుర్వాసనని కూడా పోగొట్టుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ పౌడర్ కలపాలి. ఈ నీటితో రోజుకు కనీసం 2 సార్లు శుభ్రం చేసుకోవాలి.
3. లవంగం
లవంగాన్ని మసాలాగా ఉపయోగిస్తారు. ఇది చాలా సుగంధంగా ఉంటుంది. అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. మీ శ్వాసను తాజాగా ఉంచడానికి మీరు లవంగాలను పచ్చిగా నమలవచ్చు. కావాలంటే ఉదయం బ్రష్ చేసిన తర్వాత లవంగాలతో తయారు చేసిన టీని తాగవచ్చు.