Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ అలవాట్లని మార్చుకోండి..!

Back Pain: టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి జనాలకి శ్రమ తగ్గిపోయింది. అన్ని సులువుగా జరుగుతున్నాయి...

Update: 2022-03-13 05:15 GMT

Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ అలవాట్లని మార్చుకోండి..!

Back Pain: టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి జనాలకి శ్రమ తగ్గిపోయింది. అన్ని సులువుగా జరుగుతున్నాయి. కానీ మారిన జీవనశైలి కారణంగా కొత్త కొత్త సమస్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం వెన్నునొప్పి పెద్ద సమస్యగా మారింది. దీని కారణంగా యువత పెద్ద సంఖ్యలో బాధపడుతున్నారు. కారులోనో, బస్సులోనో ప్రయాణించి ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లి ఆఫీసుకు చేరిన తర్వాత హాయిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే నొప్పి లక్షణాలు ఏంటి.. వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

వెన్నునొప్పి లక్షణాలు

1. నడుము వెనుక భాగంలో చాలా నొప్పి ఉండటం.

2. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడంలో ఇబ్బంది.

3. వెన్నెముక మధ్యలో కీళ్లు అరగడం వల్ల నొప్పి రావడం.

4. లేవడం, కూర్చోవడం కష్టంగా ఉండటం.

వెన్నునొప్పిని నివారించడానికి సులభమైన మార్గాలు

1. ఉదయం నేరుగా లేవకండి. ఒక వైపునకు తిరిగి మంచం నుంచి నెమ్మదిగా లేవండి.

2. మెత్తని బెడ్ మీద పడుకోకండి. వీలైనంత గట్టి బెడ్ మీద పడుకోండి. ఇలా చేస్తే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. మీరు కూర్చొని పని చేస్తే, ప్రతి గంటకు ఒకసారి నడవండి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

4. పొడవాటి హీల్స్ ఉన్న చెప్పుల వాడకాన్ని తగ్గించండి.

5. వ్యాయామం ఇది మీ శరీరం నొప్పికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.

6. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకండి. మీ భంగిమను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.

Tags:    

Similar News