Fitness Tips: ఫిట్‌గా ఉండాలంటే వీటిని వదిలేయండి.. వ్యాయామం కూడా అవసరం లేదు..!

Fitness Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు.

Update: 2023-06-22 15:30 GMT

Fitness Tips: ఫిట్‌గా ఉండాలంటే వీటిని వదిలేయండి.. వ్యాయామం కూడా అవసరం లేదు..!

Fitness Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు. రోజు రోజుకి ఈ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. బిజీలైఫ్‌ కారణంగా చాలామందికి వ్యాయామం చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. దీంతో అధిక బరువుతో కొత్త కొత్త వ్యాధులని కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కచ్చితమైన డైట్‌ పాటించడం వల్ల అధిక బరువుని కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బరువు తగ్గడానికి ముందుగా డైట్‌లో మార్పుచేయాలి. ముందుగా ఐదు పదార్థాలతో తయారు చేసిన ఆహారాలని తినడం మానేయాలి. అప్పుడే ఒక వారంలో ఫలితం చూస్తారు. బరువు తగ్గడానికి తెల్ల బియ్యం, తెల్ల పిండితో చేసిన పదార్థాలు, చక్కెర, చక్కెర ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, ఉప్పు తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రిపూట వీటిని తినడం మానేయాలి. ఇలా చేయడం వల్ల వారం రోజుల్లోనే తేడా గమనిస్తారు.

4 గంటల ముందు ఆహారం

బరువు తగ్గాలనుకుంటే నిద్రవేళకు నాలుగు గంటల ముందు ఆహారం తినాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. ఇప్పటి వరకు ఈ పొరపాటు చేస్తుంటే వెంటనే సరిదిద్దుకోండి. అప్పుడే వేగంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. మాంసాహారాలు తినడం మానుకోండి. ఆల్కహాల్‌, సిగరెట్‌ అలవాటు ఉంటే వెంటనే మానేయడం ఉత్తమం. ఇలా డైట్‌ ఫాలో అయితే నెల రోజుల్లోనే బరువు తగ్గడం గమనిస్తారు. 

Tags:    

Similar News