Health Tips: ఆస్తమా రోగులకి ఈ జ్యూస్‌ దివ్యౌషధం.. ఎండాకాలం తీసుకుంటే మంచి ఫలితాలు..!

Health Tips: పుచ్చకాయ పెద్ద మొత్తంలో నీరు కలిగిన పండు

Update: 2023-03-13 01:30 GMT

Health Tips: ఆస్తమా రోగులకి ఈ జ్యూస్‌ దివ్యౌషధం.. ఎండాకాలం తీసుకుంటే మంచి ఫలితాలు..!

Health Tips: పుచ్చకాయ పెద్ద మొత్తంలో నీరు కలిగిన పండు. అందుకే వేసవిలో ఎక్కువగా తింటారు. దీనివల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పుచ్చకాయ రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. దీంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాదు పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే రుచిగా పుచ్చకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

3 కప్పులు తరిగిన పుచ్చకాయ ముక్కలు

1 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు

1/2 స్పూన్ నల్ల ఉప్పు

1 స్పూన్ చక్కెర

1/2 నిమ్మకాయ

4-5 ఐస్ క్యూబ్స్ (ఇష్టమైతే)

ఎలా తయారు చేయాలి?

పుచ్చకాయ జ్యూస్ తయారు చేయాలంటే ముందుగా ఒక పుచ్చకాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత గింజలను తీసివేయాలి. తర్వాత పుదీనా ఆకులను తీసుకొని కడిగి చిన్నగా కత్తిరించాలి. తర్వాత మిక్సీలో పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులు, నల్ల ఉప్పు, చక్కెర వేసి బాగా గ్రైండ్ చేయాలి. తరువాత సిద్ధం చేసిన మిశ్రమంలో నిమ్మరసం వేసి బాగా కలపాలి. సిద్ధం చేసిన రసాన్ని సర్వింగ్ గ్లాస్‌లో పోసి దీనిపైన 2-3 ఐస్ క్యూబ్స్, పుదీనా ఆకులను వేసి సర్వ్ చేస్తే సరిపోతుంది.

Tags:    

Similar News