Ashwagandha: అశ్వగంధ పురుషులకి దివ్యవౌషదం.. ఈ సమస్యలకి పరిష్కారం..!
Ashwagandha: ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆయుర్వేద మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి.
Ashwagandha: ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆయుర్వేద మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రకృతి మనకు ఇలాంటి అనేక మూలికలను అందించింది. మీరు అశ్వగంధ పేరు వినే ఉంటారు. ఇది అద్భుతమైన ఔషధం. దీని సహాయంతో అనేక శారీరక, మానసిక సమస్యలను అధిగమించవచ్చు. అశ్వగంధ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే దీనిని స్ట్రెస్ బస్టర్ అంటారు. అశ్వగంధ సప్లిమెంట్స్ శరీరం ఒత్తిడి స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడతాయి.
అశ్వగంధలో శాంతి, శ్రేయస్సు భావాలను పెంపొందించే సమ్మేళనాలు మెండుగా ఉన్నాయి. ఇది మంచి నిద్ర పొందడానికి మీకు సహాయపడుతుంది. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడమే కాదు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా వచ్చే గ్యాస్ట్రిక్ అల్సర్‌లను తగ్గించడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుందని అనేక పరిశోధనలలో తేలింది. అశ్వగంధ సహజంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. లైంగిక బలహీనతకు టెన్షన్ ఎక్కువగా కారణమని చెబుతారు. అశ్వగంధ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
అశ్వగంధ శారీరక బలం, శక్తిని పెంచుతుంది. ఇది క్రీడాకారులకు చాలా శక్తిని అందించగలదు. ఈ హెర్బ్ సహాయంతో అథ్లెట్ మొత్తం వెన్నెముక, కండరాల శక్తి పెరుగుతుందని ఒక పరిశోధన తేలింది. అశ్వగంధ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనంలో ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 40 మందికి అశ్వగంధ, మూడు ఇతర సప్లిమెంట్‌ల కలయిక ఇచ్చారు. మూడు నెలల వ్యవధి తర్వాత అశ్వగంధ తీసుకున్నవారు కీళ్ళు, చలనశీలతలో గణనీయమైన మెరుగుదలలను చూశారు.