Weight Loss Tips: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. శెనగలతో మంచి ఫలితాలు..!

Weight Loss Tips: బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్లని పాటిస్తారు. అయితే ఆహారం తీసుకోవడం చాలావరకు తగ్గిస్తారు.

Update: 2022-07-08 11:30 GMT

Weight Loss Tips: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. శెనగలతో మంచి ఫలితాలు..!

Weight Loss Tips: బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్లని పాటిస్తారు. అయితే ఆహారం తీసుకోవడం చాలావరకు తగ్గిస్తారు. దీనివల్ల పోషకాహార లోపంతో బాధపడుతారు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలంటే ఆహారంలో అన్ని రకాల పోషకాలను చేర్చుకోవాలి. దీని కారణంగా రోగనిరోధక శక్తి తగ్గదు. అదేవిధంగా సులువుగా బరువు తగ్గుతారు. ఇందుకోసం ఆహారంలో ప్రోటీన్-రిచ్ సలాడ్లను చేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి సలాడ్లను తీసుకోవడం చాలా మేలు. ముఖ్యంగా శెనగలు, బచ్చలికూరతో చేసిన సలాడ్ పుష్కలంగా ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్-ఎ, ఐరన్, ఇతర పోషకాలు ఉంటాయి. తద్వారా మీకు రక్తహీనత వంటి సమస్యలు ఉండవు. అదే విధంగా బరువు తగ్గుతారు. ఇందుకోసం శనగలను ఉడకబెట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో పుదీనా, మసాలాలు, ఉల్లిపాయలు, టొమాటో, నిమ్మరసం వేసి.. తర్వాత పాలకూర ఆకులను ఉడకబెట్టి అందులో వేయాలి. అన్ని పదార్థాలను బాగా కలిపి తినాలి. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

శెనగలు

శెనగలు అంటే చాలా మందికి ఇష్టం. వీటిని కూర కూడా వండుకోవచ్చు. బరువు తగ్గాలంటే తప్పనిసరిగా శెనగలని డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ ఎముకలు, జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. శెనగలి రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తినవచ్చు. లేదంటే సాయంత్రం ఉడకబెట్టి స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News