Beauty Tips: పచ్చిపాలతో అందం మీ సొంతం.. డ్రై స్కిన్ వారికి సూపర్ రెమిడీ..!
Beauty Tips: ఈ రోజుల్లో గాలి కాలుష్యం వల్ల చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్కిన్ డ్రైగా మారిపోవడం వల్ల ఫేస్ మొత్తం దెబ్బతింటుంది.
Beauty Tips: ఈ రోజుల్లో గాలి కాలుష్యం వల్ల చాలామంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్కిన్ డ్రైగా మారిపోవడం వల్ల ఫేస్ మొత్తం దెబ్బతింటుంది. దీనిని సరిచేయడానికి కొంతమంది మార్కెట్‌లో ఉన్న బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడుతున్నారు. అయితే ఇవి ఇన్‌స్టంట్‌గా మాత్రమే పనిచేస్తాయి. పైగా వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే ఇంట్లో లభించే పచ్చిపాలని ఉపయోగించి సహజ సిద్దంగా చర్మాన్ని బాగుచేసుకోవచ్చు. పాలలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ డి చర్మానికి చాలా మేలు చేస్తాయి. పచ్చిపాల ఫేస్ ప్యాక్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
రాత్రిపూట పచ్చిపాలు
రాత్రి పడుకునే ముందు పొడిబారిన చర్మంపై పచ్చి పాలను అప్లై చేస్తే చర్మంలోని డ్రైనెస్ మొత్తం తొలగిపోతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల పచ్చి పాలను తీసుకుని కాటన్ బాల్స్ సహాయంతో ముఖానికి అప్లై చేసి నిద్రపోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. వెంటనే చర్మం మృదువుగా మారుతుంది.
పచ్చి పాలు, అరటిపండు మాస్క్
పచ్చి పాలలో అరటిపండు కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. అరటిపండు సహాయంతో చర్మంపై ఉండే తేమ కోల్పోకుండా చేయవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చి పాలను పోసి అరటిపండును కలపాలి. ఈ మిశ్రమాన్ని తేలికపాటి చేతులతో ముఖంపై అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.
పచ్చి పాలు, తేనె మాస్క్
పచ్చి పాలు తేనె కలయిక చర్మం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. దీని కోసం ఒక గిన్నెలో 2 చెంచాల పచ్చి పాలను తీసుకుని 1 చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో చర్మాన్ని కడగాలి. చర్మం మృదువుగా మారుతుంది.