Mango: మామిడి టెంకలని పారేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అలా చేయరు..!

Mango: ఎండాకాలంలో మామిడి తిని టెంకలని పారేస్తారు. కానీ వాటి ప్రయోజనాలు తెలిస్తే ఎవ్వరు అలా చేయరు...

Update: 2022-04-24 08:30 GMT

Mango: మామిడి టెంకలని పారేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అలా చేయరు..!

Mango: ఎండాకాలంలో మామిడి తిని టెంకలని పారేస్తారు. కానీ వాటి ప్రయోజనాలు తెలిస్తే ఎవ్వరు అలా చేయరు. మామిడి టెంకలు కొలస్ట్రాల్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ఇది కాకుండా వీటివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పనిచేస్తాయి. మామిడి టెంకల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.మధుమేహ రోగులకి మామిడి టెంకలు బాగా ఉపయోగపడుతాయి.

వీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్‌ చేయవచ్చు. డయాబెటిక్ పేషెంట్లకు మామిడి టెంకలు చాలా మేలు చేస్తాయి. పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవడానికి మామిడి టెంకలు ఉపయోగపడుతాయి. గుండెను ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతాయి. హృద్రోగులు తప్పనిసరిగా తినాలి. వాస్తవానికి, శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది దంతాలకు చాలా మేలు చేస్తుంది. ఇందులో పెద్ద మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల బలానికి ఉపయోగపడుతుంది.

ఉబ్బరం, జీర్ణ సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి మామిడి టెంక మంచి ఔషధంలా పనిచేస్తుంది. మామిడి టెంకను పొడిగా చేసుకొని మజ్జిగలో కలిపి, కాస్త ఉప్పు చేర్చి తాగితే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మామిడి టెంకను పొడి చేసుకొని అందులో జీలకర్ర, మెంతుల పొడిని సమానంగా కలపాలి. ఈ పొడిని నిత్యం వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులను మామిడి టెంక తగ్గిస్తుంది. టెంకలో ఉన్న గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News