Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో ఫిట్‌నెస్‌.. ఊబకాయానికి చెక్..!

Pumpkin Juice: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.

Update: 2022-08-01 02:30 GMT

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో ఫిట్‌నెస్‌.. ఊబకాయానికి చెక్..!

Pumpkin Juice: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే స్థూలకాయం అనేక రకాల వ్యాధులకి కారణం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. బరువును తగ్గించుకోవాలనుకుంటే గుమ్మడికాయ రసాన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు తగినంత పరిమాణంలో ఉంటాయి.

గుమ్మడికాయలో విటమిన్ డి అధికంగా లభిస్తుంది. ఇది మొత్తం శరీరానికి మేలు చేస్తుంది. గుమ్మడికాయ రసం చేయడానికి ముందుగా పండిన గుమ్మడికాయ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల నుంచి పీల్స్ తొలగించాలి. తర్వాత బాగా గ్రైండ్ చేసి అందులో యాపిల్ ముక్కలను వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి జ్యూస్ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌ని రోజూ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

గుమ్మడికాయ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మరోవైపు జీర్ణక్రియ సరిగ్గా ఉంటే సులువుగా బరువు తగ్గుతారు. గుమ్మడికాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతాయి. ఇది కాకుండా వాపును తగ్గించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది.

Tags:    

Similar News