Health Tips: అధిక బీపీతో ఇబ్బందిపడుతున్నారా.. రోజు ఈ 3 పచ్చి ఆకులని నమలండి..!

Health Tips: ప్రస్తుతం ప్రపంచంలో రెండు వ్యాధులు సర్వసాధారణంగా మారాయి.

Update: 2023-03-11 09:52 GMT

Health Tips: అధిక బీపీతో ఇబ్బందిపడుతున్నారా.. రోజు ఈ 3 పచ్చి ఆకులని నమలండి..!

Health Tips: ప్రస్తుతం ప్రపంచంలో రెండు వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. వీటిలో ఒకటి అధిక రక్తపోటు రెండోది మధుమేహం. ఈ రెండూ జీవనశైలి సంబంధిత వ్యాధులు. మీరు ఆహారం, నిద్ర సమయంలో సరైన శ్రద్ధ వహిస్తే ఈ వ్యాధులను సులభంగా నియంత్రించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మూడు పచ్చి ఆకుల గురించి ఈరోజు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వల్ల బిపిని సాధారణీకరించడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

వేప చెట్టు ఆకులు

వేప ఆకులు చేదుగా ఉన్నా వాటిలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేప ఆకులలో యాంటిహిస్టామైన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్త సరఫరా నాళాలను విస్తరిస్తుంది. దీని వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుంది. రోజూ 2 వేప ఆకులను తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

కరివేపాకు

మీరు వేప ఆకులను తినకూడదనుకుంటే కరివేపాకును ఉపయోగించవచ్చు. ఈ ఆకులలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ ఏర్పడటానికి ప్రోత్సహిస్తుంది. పిండి పదార్ధాన్ని గ్లూకోజ్‌గా విభజించే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఈ ఆకులలో పెద్ద మొత్తంలో పీచు లభిస్తుంది. దీని వల్ల కడుపులోని జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

తులసి ఆకులు

తులసిని ఆయుర్వేద లక్షణాల భాండాగారంగా చెబుతారు. రోజూ 2-3 తులసి ఆకులను నమలడం వల్ల శరీరంలోని లిపిడ్ కంటెంట్ తగ్గుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు సాధారణం అవుతుంది. దీని ఉపయోగం గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్‌లో తులసి ఆకులను నమలడం కూడా మేలు చేస్తుంది.

Tags:    

Similar News