అధికంగా బరువు పెరుగుతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం ఉన్నట్లే..!

Gaining Weight: మీరు నిరంతరం బరువు పెరుగుతున్నట్లయితే తప్పనిసరిగా 4 పరీక్షలు చేయించుకోవాలి.

Update: 2022-04-03 15:30 GMT

అధికంగా బరువు పెరుగుతున్నారా.. ఈ వ్యాధుల ప్రమాదం ఉన్నట్లే..!

Gaining Weight: మీరు నిరంతరం బరువు పెరుగుతున్నట్లయితే తప్పనిసరిగా 4 పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే బరువు తగ్గడం కొన్ని వ్యాధులకి లక్షణమైనట్లే బరువు పెరగడం కూడా కొన్ని వ్యాధులకి సంకేతం. ఈ పరిస్థితిలో మీరు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. బరువు పెరిగినప్పుడు చేయవలసిన ముఖ్యమైన పరీక్షలు ఏంటో తెలుసుకుందాం.

PCOS పరీక్ష చేయించుకోండి

PCOS (Polycystic ovary syndrome) చాలా మందిలో బరువు పెరగడానికి కారణమవుతుంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పుడుతుంది. మీరు అధికంగా బరువు పెరిగినట్లయితే తప్పనిసరిగా PCOS పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం అనేక వ్యాధులకు కారణమవుతుంది. నిరంతరం బరువు పెరగడం మధుమేహం లక్షణం కావొచ్చు. బరువు పెరగడంతో పాటు తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే రక్తంలో షుగర్‌ పెరిగిపోయి ఉండవచ్చు. ఈ సందర్భంగా మీరు వెంటనే షుగర్ టెస్ట్‌ చేయించుకోవాలి.

మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ వల్ల మీ బరువు పెరిగి ఉండవచ్చు. బరువు పెరగడంతోపాటు జుట్టు రాలడం, గోళ్లు విరగడం వంటి సమస్యలు ఉంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష అవసరం. ఊబకాయం వల్ల చాలా మందికి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. దీన్ని నివారించడానికి మీరు తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాలి. 

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News