Onions Side Effects: ఉల్లిపాయ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?
Onions Side Effects: ఉల్లిపాయ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?
Onions Side Effects: ఉల్లిపాయని కట్ చేసినప్పుడు కళ్ల నుంచి నీరు కారుతాయి. అయినప్పటికీ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవసరానికి మించి తీసుకుంటే మాత్రం అనర్థాలు తప్పవు. ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొందరికి తొందరికి జీర్ణం కాదు. ఈ పరిస్థితిలో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది.
షుగర్ పేషెంట్లు వైద్యుల సలహా లేకుండా పచ్చి ఉల్లిపాయ తినకూడదు. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలకి గురికావాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా పచ్చి ఉల్లిపాయను తింటే గుండెల్లో మంటని కలిగిస్తుంది. అంతేకాదు నోటి నుంచి దుర్వాసన వస్తోంది. ఈ పరిస్థితిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రయత్నించండి.
పచ్చి ఉల్లిపాయ తినేముందు తొక్క తీశాక, శుభ్రంగా నీటిలో కడగాలి. అలాగే తినేయడం వల్ల సాల్మొనెల్లా అనే ఇన్ ఫెక్షన్ శరీరంలో చేరుతుంది. దీనివల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు దాడి చేస్తాయి. శుభ్రంలేని ఉల్లిపాయలు రెండు మూడు తినడం వల్ల అధిక స్థాయిలో ఇన్ ఫెక్షన్ పొట్టలో చేరుతుంది. పచ్చి ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల కొన్ని రకాల అలెర్జీలు కూడా దాడి చేస్తాయి. అవి చర్మం, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.