Health: వర్షాకాలం నాన్‌వెజ్‌ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health: వర్షాకాలం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్‌లో కొందరు ఇష్టమైన ఆహారాన్ని తింటారు.

Update: 2022-07-02 09:30 GMT

Health: వర్షాకాలం నాన్‌వెజ్‌ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Health: వర్షాకాలం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సీజన్‌లో కొందరు ఇష్టమైన ఆహారాన్ని తింటారు. మరికొందరు వాన చినుకుల్లో తడుస్తూ బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళతారు. అయితే ఈ వాతావరణంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిపాటి అజాగ్రత్త మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. వర్షంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో నాన్ వెజ్ తినడం మానుకోండి. మాంసాహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతే కాకుండా ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

1. ఫంగస్ వచ్చే ప్రమాదం: వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి.

2. బలహీనమైన జీర్ణక్రియ: వర్షాకాలంలో జీర్ణ శక్తి తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో నాన్‌వెజ్‌ ఫుడ్‌ జీర్ణం కావడం కష్టమవుతుంది. ఆలస్యంగా జీర్ణం కావడం వల్ల ఆహారం ప్రేగులలో కుళ్ళిపోతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.

3. జంతువులు అనారోగ్యానికి గురవుతాయి: వర్షాలకు కీటకాలు పెరుగుతాయి. జంతువులు అనారోగ్యానికి గురవుతాయి. ఈ సీజన్‌లో జంతువులలో అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో నాన్ వెజ్ తినడం మంచిదికాదు.

4. చేపలు కలుషితమవుతాయి: వర్షంనీటిలో మురికినీరు కలుస్తుంది. ఇంకా బురద కూడా చేరుతుంది. దీనివల్ల చెరువులు, నదులు కలుషిత జలాలతో నిండుతాయి. ఈ పరిస్థితిలో చేపలు కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ సీజన్‌లో చేపలు తినడం కూడా మానేయాలి. ఇది మిమ్మల్ని తొందరగా అనారోగ్యానికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. 

Tags:    

Similar News