Jaggery Peanut: పల్లిపట్టి తింటున్నారా..! దీని గురించి మీకు ఈ విషయం తెలుసా..?
Jaggery Peanut: బెల్లం, వేరుశెనగలతో తయారు చేసే పల్లిపట్టీ అంటే అందరు ఇష్టపడుతారు.
Jaggery Peanut: బెల్లం, వేరుశెనగలతో తయారు చేసే పల్లిపట్టీ అంటే అందరు ఇష్టపడుతారు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు నోరూరుతుంది. కిరాణాషాపులో కనిపించినా చటుక్కున తీసుకొని నోట్లో వేసుకుంటారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందుకు పల్లీపట్టీ అంటే అందరికి మక్కువ ఎక్కువ. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో తింటే శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రోజూ తినడం వల్ల శరీరంలో రక్తానికి కొరత ఉండదు. రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. అయితే పల్లిపట్టీని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం.
కావలసినవి:
పల్లిపట్టీ చేయడం చాలా సలువు. ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీకు 250 గ్రాముల పొట్టు తీసిన వేరుశెనగ, 200 గ్రాముల బెల్లం, అర కప్పు నీరు, అవసరాన్ని బట్టి వెన్న, అవసరాన్ని బట్టి గింజలు అవసరం. ముందుగా పాన్ వేడి చేసి, వేరుశెనగలను బాగా వేయించాలి. తద్వారా నోటికి రుచికరంగా మారుతాయి. తరువాత వేయించిన వేరుశెనగ గింజలను ముతకగా దంచాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు నీళ్లు పోసి బెల్లం వేసి గ్యాస్‌పై ఉడికించాలి. బెల్లం సిరప్‌లో వేరుశెనగ వేసి బాగా కలపాలి. నెయ్యి లేదా వెన్నతో కలిపి ఒక ప్లేట్ లేదా ట్రేలో ఆ మిశ్రమాన్ని వేయాలి. తరువాత దానిపై బెల్లం-శెనగపిండి కలిపి కావలసిన ఆకృతిలో సిద్దం చేసుకోవచ్చు. పల్లిపట్టీని కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినవచ్చు. వీటిని ఒక పొడి డబ్బాలో భద్రపరుచుకుని అతిథులకు కూడా రుచి చూపించవచ్చు.